ఇండియాలోనే కాదు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంబరాన్ని అంటుతుంది. ఆకాశమంతి పందిరి వేసి చేసినట్టుగా తన చిన్న కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. మరో ఫార్మా వ్యాపార దిగ్గజం వీరెన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి ఈ రోజు(జులై 2)న గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ముంబయిలోని జీయో కల్చరల్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరుగుతుంది. ఇందులో భారతీయ సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, క్రికెటర్లు, ప్రపంచ సెలబ్రిటీలు ఇలా వేల మంది పాల్గొన్నారు. సినిమా స్టార్స్ స్పెషల్ ఎట్రాక్ష్‌గా నిలిచారు. తెలుగు నుంచి మహేష్‌బాబు, వెంకటేష్, రానా, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రజనీకాంత్, నయనతార, అట్లీ, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్, కత్రినా, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం ఇలా బాలీవుడ్ తారలంతా సందడి చేశారు.
అంబానీ తన కొడుకి పెళ్లికి ఏకంగా ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో ఈ పెళ్లి వేడుక చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ మ్యారేజ్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కాబట్టి ఈ స్థాయిలోగ్రాండియర్‌గా కొడుకు పెళ్లి చేస్తున్నాడు. అదే వారిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే, సింపుల్‌గా పెళ్లి చేయాల్సి వస్తే ఎలా చేస్తారో, వాళ్లు ఎలా ఉంటారో క్రియేట్ చేశాడు ఓక్రియేటర్.
షాహిద్ ఎస్‌కే అనే మెగాలాడన్ క్రియేటివ్ టెక్ కంపెనీ హెడ్ `ఏఐ`(ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్) ద్వారా అంబానీ ఇంటిపెళ్లి వేడుకని డిజైన్ చేశాడు షాహిద్ ఎస్కే. తన లింక్‌డ్ ఇన్ అకౌంట్ ద్వారా ఆయా ఫోటోలను పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊపేస్తున్నాయి. క్రేజీ లుక్స్ తో అంబానీ ఫ్యామిలీ ఆకట్టుకుంటుంది. మిడిల్ క్లాస్ లుక్ లో చాలా ఫన్నీగా ఉన్నారు.
2006లో బాలీవుడ్‌లో వచ్చిన `వివాహ` అనే సినిమాలోని ఫోటోలను ఆధారంగా చేసుకుని ఈ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేశాడు షాహిద్. అంబానీ ఫ్యామిలీని చాలా నేచురల్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మార్చేశాడు.
ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ ఫోటోల్లో ముఖేష్ అంబానీ, వారి ఫ్యామిలీ చాలా సింపుల్‌గానే ఉన్నారు. మన చుట్టూఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్లు ఎలా మ్యారేజ్ చేసుకుని, మాస్‌గా ఎంజాయ్ చేస్తారో, ఇందులోనూ అలానే ఎంజాయ్ చేయడం విశేషం.
పెళ్లి కూతురుని రెడీ చేయడం, ఆమెకి ధరించిన పెళ్లి దుస్తుల నుంచి, నీతా ఆంబానీ రెడీ అయిన తీరు, వారి ఫ్యామిలీ లుక్ అంతా ఫన్నీగా అనిపిస్తుంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టయిల్ లో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారో తెలియజేసే చిత్రాలివి. ఆద్యంతం ఆకట్టుకుంటున్నారు. అందరిని సర్‌ప్రైజ్ చేస్తున్నాయి.
పెళ్లి అయిపోయాక ముఖేష్ అంబానీ, తమ బంధువులకు రాత్రి పడుకునేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారనేది మరింత క్రేజీగా ఉంది.
ఇక కొత్త జంట ఫస్ట్ నైట్‌కి ఎలా రెడీ అవుతారు, వాళ్లు ఏంచేస్తారనేది ఏఐలో క్రియేట్ చేసిన తీరు, అనంత్‌కి రాధిక పాల గ్లాస్ ఇస్తున్న తీరు ఫన్నీగా ఉంది.