శ్రీకాకుళంలో మొదలైన బిగ్ బాస్ రేవంత్ ఎమోషనల్ జర్నీ.. ప్రాణానికి ప్రాణమైన భార్య గర్భంతో ఉండగా..

Published : Sep 05, 2022, 05:38 PM IST

ఇండియన్ ఐడల్ విజేత, పాపులర్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6లోకి ఎంటర్ అయ్యాడు. సింగర్ గా టాలీవుడ్ లో రేవంత్ అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

PREV
16
శ్రీకాకుళంలో మొదలైన బిగ్ బాస్ రేవంత్ ఎమోషనల్ జర్నీ.. ప్రాణానికి ప్రాణమైన భార్య గర్భంతో ఉండగా..

ఇండియన్ ఐడల్ విజేత, పాపులర్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ 6లోకి ఎంటర్ అయ్యాడు. సింగర్ గా టాలీవుడ్ లో రేవంత్ అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రేవంత్ పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6లో తప్పకుండా కీలక కంటెస్టెంట్ అవుతాడని అంటున్నారు. 

 

26

రేవంత్ ఎమోషనల్ జర్నీ కూడా అతడిని అభిమానులకు చేరువ చేస్తోంది. ప్రస్తుతం అతడి భార్య అన్విత 6 నెలల గర్భవతి. ఇవన్నీ రేవంత్ పై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం కలగజేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు రేవంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. వీడియో మెసేజ్ ద్వారా ఆడియన్స్ ని తనకు సపోర్ట్ చేయాలని రిక్వస్ట్ చేశాడు. 

36

శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను. వైజాగ్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాను. మ్యూజిక్ పై ఫ్యాషన్ లో హైదరాబాద్ కి వచ్చాను. ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాటలు పాడాను. కానీ మ్యూజిక్  పై నా సొంత బ్రాండ్ ఉండాలనే కసితో ఇండియన్ ఐడల్ లో పాల్గొన్నాను. మీ అందరి సపోర్ట్ తో విజేతగా నిలిచాను. ఇప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు కావాలి. బిగ్ బాస్ 6 లో పాల్గొనబోతున్నా అని రేవంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. 

46

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు తన భార్య గురించి బాధపడ్డాడు. నేను పక్కన ఉండాల్సిన టైంలో ఉండలేకపోతున్నా అని తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రేవంత్, అన్విత వివాహం జరిగింది. 

56

బాహుబలి చిత్రంలో మనోహరి సాంగ్, అర్జున్ రెడ్డి మూవీలో 'తెలిసేనే నా నువ్వే' సాంగ్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో రేవంత్ పాడారు. బద్రీనాథ్, ప్రేమ కథా చిత్రం ఇలా ఎన్నో చిత్రాల్లో రేవంత్ పాటలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 6లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. 

66

వీరందరిని అధికమించి బిగ్ బాస్ 6 టైటిల్ గెలుచుకోవడం అంత సులభం కాలేదు. మరి రేవంత్ కి టైటిల్ గెలిచే సత్తా ఉందో లేదో తెలియాలంటే కొన్ని వారాలు అతడి ఆటని గమనించాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకోవాలంటే రేవంత్ హౌస్ లో తెలివిగా, చురుగ్గా ఉండాలి. సోషల్ మీడియాలో అభిమానులంతా రేవంత్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. 

click me!

Recommended Stories