ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. సినీ వర్గాల్లో, ఆడియన్స్ లో ఈ చిత్రంపై ఎంత భారీగా అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు మొదలయ్యాయి. ఇక సినిమా కనుక క్లిక్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ పై బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
గతంలో అల్లు అర్జున్.. చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఫ్యాన్స్ తెగ వైరల్ అవుతున్నారు. అల్లు అర్జున్ థియేటర్స్ లో ఎక్కువ సార్లు చూసిన చిత్రం ఇంద్ర. ఈ విషయాన్ని బన్నీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇంద్ర చిత్రాన్ని 17 సార్లు చూశాక తన ఫ్రెండ్స్ తో ఒక బెట్టింగ్ జరిగిందట. ఇంద్ర చిత్రంలో వీణ స్టెప్పుని చిరంజీవి గారు మాత్రమే సోలోగా చేశారు. పక్కన ఎవరూ లేరు అని చెప్పాడట. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం లేదు చిరంజీవి పక్కన సోనాలి బింద్రే ఉంది అని బెట్టింగ్ వేసారట. బెట్టింగ్ 25 వేల రూపాయలు.
18వ సారి వెళ్లి బాగా గమనిస్తే పక్కన సోనాలి బింద్రే కూడా డ్యాన్స్ చేస్తోంది. నాకు 17 సార్లు ఆ సాంగ్ లో చిరంజీవి గారు మాత్రమే కనిపించారు. చిరంజీవిని తప్ప ఇంకెవరినీ నేను పట్టించుకోలేదు. ఆ విధంగా 25 వేల రూపాయలు నష్టపోయా అంటూ బన్నీ బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పారు.
ఆ విధంగా బన్నీ.. చిరుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గంగోత్రి చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉండబోతోంది.. ఆ తర్వాత బన్నీ చేయబోయే చిత్రం ఏంటి అనే అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.