ఇక హౌస్ లో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం బిగ్ బాస్ లో నిఖిల్, నబిల్, విష్ణు ప్రియ, రోహిణి, ప్రేరణ, అవినాశ్ ఉన్నారు. వీరిలో గౌతమ్ మాట్లాడుతూ.. నిఖిల్ ను పొరపాటుగా కొన్ని అన్నానని సారిచెప్పాడు. అటు నిఖిల్ కూడా తాను కూడా ఏమైనా పొరపాటుగా అంటే సారి అంటూ ఒకరిని మరొకరు హగ్ చేసుకున్నారు.
ఇక ఇలాంటి విషయాన్నే మరొకటి తేల్చుకునే క్రమంలో అవినాశ్, నబిల్ మధ్య మాట మాట పెరిగింది. నబిల్ నిజస్వరూపం ఇదే అంటూ... అవినాశ్ పాత విషయాలు కూడా బయటకుతీసి మరీ గొడవేసుకున్నారు. రోహిణి అవినాశ్ కుసపోర్ట్ పలకడంతో పాటు.. కావాలని హౌస్ లో.. టైటిల్ రేస్ లో ఉన్నవారిని బ్యాడ్ చేయాలని చూస్తున్నట్టుఅనిపించింది.