ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఏంటి పుష్పా, డబ్బులు రిఫండ్ చేసేస్తారా?

First Published | Dec 4, 2024, 6:58 AM IST

పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రస్తుతానికి 2D వెర్షన్‌లో మాత్రమే విడుదల అవుతుంది. 3D వెర్షన్ పనులు పూర్తి కాకపోవడంతో 3D విడుదల వాయిదా పడింది. 3D టికెట్లు బుక్ చేసుకున్నవారికి 2D వెర్షన్ చూపించి, 3D గ్లాసెస్ ఛార్జీలు తిరిగి ఇస్తారు.

Pushpa 2: The Rule, Sukumar, allu arjun

 ‘పుష్ప2: ది రూల్‌’ మూవీని ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్‌లలో వివిధ ఫార్మాట్‌లలో విడుదల చేయాలని చిత్ర టీమ్  నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి 3D వెర్షన్‌ను విడుదల చేయటం లేదట. మూవీని 3డీ వెర్షన్‌కు (pushpa 2 3d show) అనుగుణంగా షూట్‌ చేసినప్పటికీ అందుకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్స్‌లోనూ 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారని, సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Pushpa 2, Telangana High Court, allu arjun, ticket rates


 ఇప్పటికే 3డీ వెర్షన్‌లో చూద్దామని టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే, ఆ షో క్యాన్సిల్‌ అయ్యే అవకాశం ఉంది. లేదా అదే స్క్రీన్‌లో 2డీ వెర్షన్‌లో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్‌ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. 


Pushpa 2 pre release event

పుష్ప2 సినిమా 3డీ వెర్షన్ వర్క్ కంప్లీట్ అవ్వలేదని తెలిసింది. అందువల్ల.. పుష్ప2 3డీ వెర్షన్ రిలీజ్ పోస్ట్పోన్ అయింది. డిసెంబర్13న పుష్ప2 3డీ వెర్షన్ రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అప్పటికి 3డీ ప్రింట్స్ రెడీ అవుతాయట. ఎగ్జిబిటర్స్కు ఈ మేరకు పుష్ప2 టీం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.

Pushpa 2, allu arjun, sukumar, OTT Release


అయితే 3డీలో పుష్ప.2 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ మేనేజర్ సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు నిరాశచెందాల్సిన అవసరం లేదని, 3డీ షోలు క్యాన్సిల్ చేయడం లేదని.. ఆ 3డీ షోల స్థానంలో పుష్ప-2 2డీ వెర్షన్ షోస్ ప్రదర్శిస్తామని తెలిపారు.

3డీ టికెట్ రేట్లు ఎక్కువ ఛార్జ్ చేసి ఉంటారు కదా.. మరి ఆ డబ్బుల సంగతేంటని అడగ్గా.. 3డీ గ్లాసెస్ యూసేజ్ కారణంగా 3డీ వెర్షన్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయని.. ఆ ఛార్జీలను  రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. 

Pushpa 2, Pre-Release Premieres, sukumar



  సుకుమార్‌- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్‌, డాల్బీ, డిబాక్స్‌, 4డీఎక్స్‌, ఐస్‌, 2డీ లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. డిసెంబర్ 4న రాత్రి 9.30కే తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పుష్ప-2 ప్రీమియర్ షో పడనుంది. డిసెంబర్ 5 అర్ధరాత్రి సమయానికే పుష్ప-2 ఎక్సపెక్టేషన్స్ ను అందుకుందో, లేదో తెలిసిపోతుంది. డిసెంబర్ 5న కూడా అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ రికార్డ్ స్థాయిలో బుక్ కావడం గమనార్హం.  

Latest Videos

click me!