ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడా..? అందుకే మూడు సార్లు ఛాన్స్ ఇచ్చాడా..?

First Published | Aug 14, 2024, 10:46 AM IST

ప్రస్తుతం పుప్ప2 తో ఫుల్ బిజీగా  ఉన్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్.. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్. కాగా బన్నీ కెరీర్ లో ఆయనతో ఎక్కువగా  సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ  స్పెషల్ ఇమేజ్ ను ఆయన క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ యూత్ కు స్టైలీష్ ఐకాన్ గా నిలిచాడు బన్నీ. ఇక బన్నీ బ్రాండ్ అంతా ఇంతా కాదు.. ఆయన అంటే ఫ్యాన్స్ పడి చస్తారు. లేడీ ఫ్యాన్స్ అయ్యితే.. అల్లు మాట చెపితే మెలికలు తిరిగిపోతుంటారు. 
 

ఇంత ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ అంటే.. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అభిమానించడం కామన్. ఎంతో మంది హీరోయిన్లు బన్నీతో కలిసి నటించాలని పరితపిస్తుంటారు. ఇంత మంది తారులు అల్లు అర్జున్ కోసం చూస్తుంటే.. ఆయన మాత్రం తన కెరీర్ లో ఓ హీరోయిన్ పై మనసు పారేసుకుని.. ముచ్చటపడ్డాడట. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసా..? 
 


అల్లు అర్జున్ కెరీర్ లో ఎక్కువ సార్లు అవకాశాలు ఇచ్చిన హీరోయిన్లు తక్కువనేచెప్పాలి. కాజల్ మాత్రమే  రెండు సినిమాల్లో బన్నీతో కలిసి నటించింది. అయితే అల్లు అర్జున్ మాత్రం ఓ హీరోయిన్ కు ముచ్చటగా మూడు సార్లు అవకాశం ఇచ్చాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె ఎవరో  కాదు ..కేథరిన్ తెరిస్సా. అవును ఈ హీరోయిన్ బన్నీతో మూడు సినిమాల్లో నటించింది. 

వరుణ్ సదేశ్ తో చమ్మకు చల్ల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేథరిన్.. ఆతరువాత అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో మూవీలో సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటించింది. ఇక ఈసినిమా తరువాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి టాలీవుడ్ లో. ఇక ఈ బ్యూటీతో ఇద్దరమ్మాయిలు సినిమా తరువాత సరైనోడు సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. అంతే కాదు రుద్రమదేవి సినిమాలో కూడా గోన గన్నారెడ్డ పాత్రలో బన్నీ ఉంటే ఆయన జోడీగా అన్నాంబిక పాత్రలో కేథరిన్ నటించింది. 

ఇలా ఆయన కేథరిన్ మీద మనసు పారేకున్నారని.. అందుకే మూడు సార్లు తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారని.. టాలీవుడ్ టాక్.  ఇక కేథరిన్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. తెలుగులో ఈమె పైసా, నేనే రాజు నేనే మంత్రి,గౌతమ్ నంద, సరైనోడు, వదలడు, వరల్డ్ ఫేమస్ లవర్,బింబిసారా వంటి మూవీస్ లో నటించింది.కానీ ఈమె ఎక్కువ శాతం సెకండ్ హీరోయిన్ గానే చేసింది.
 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 తో బిజీగా ఉన్నాడు. పుష్ప సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈమూవీ  అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఈసారి ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు ఐకాన్ స్టార్. వెయ్యికోట్లు కలెక్షన్ దాంటించాలని చూస్తున్నాడు.  

Latest Videos

click me!