అల్లు అర్జున్ ఫారెన్ నుంచి తెప్పించుకుని తినే ఫుడ్.. అంత కాస్ట్లీగా ఎందుకంటే..

First Published | Oct 23, 2024, 10:29 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ గా ఉంటాడో చెప్పనవసరం లేదు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ పుష్ప ప్రాజెక్ట్ రెండు భాగాల కోసం ఒకే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఒకే ఫిజిక్ మైంటైన్ చేయడం కేవలం జిమ్ వల్ల సాధ్యం కాదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ గా ఉంటాడో చెప్పనవసరం లేదు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ పుష్ప ప్రాజెక్ట్ రెండు భాగాల కోసం ఒకే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు ఒకే ఫిజిక్ మైంటైన్ చేయడం కేవలం జిమ్ వల్ల సాధ్యం కాదు. ఫుడ్ విషయంలో కూడా కేరింగ్ ఉండాలి. 

ఒక సందర్భంలో దర్శకధీరుడు రాజమౌళి నిర్వహించిన కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి అల్లు అర్జున్ తో ఇండియాలో పోషకాహార లోపం గురించి చర్చించారు. అల్లు మాట్లాడుతూ మనిషి ఫిట్ గా ఉండాలంటే చీప్ గా దొరికే ఫుడ్ ఉంది అలాగే కాస్ట్లీ ఫుడ్ కూడా ఉంది. ఏదైనా అవసరమైన మేరకు తీసుకుంటే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు అని అల్లు అర్జున్ తెలిపారు. 


తాను సినిమాల కోసం కొన్ని రకాల డైట్ ఫాలోఅవుతుంటా అని అల్లు అర్జున్ తెలిపారు. దేశముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ పెంచడం కోసం బన్నీ ప్రత్యేక డైట్ ఫాలో అయ్యాడట. చికెన్, ఎగ్స్, ఫిష్ తినేవాడిని. కార్బో హైడ్రేడ్ ఫుడ్స్ అంత మంచిది కాదు. పొట్ట ఎక్కువ కావాలంటే కార్బో హైడ్రేడ్ ఫుడ్స్ తినాలి అంటూ బన్నీ నవ్వుతూ చెప్పారు. 

ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినేవాడిని. చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం చికెన్ బ్రెస్ట్ తినేవాడిని. ట్రౌట్ ఫిష్ లో 80 శాతం ప్రోటీన్ ఉంటుంది. సాయంత్రం ఆ ఫిష్ తినేవాడిని. ఎక్కువగా ఆయిల్, మసాలా లేకుండా తినేవాడిని అని అల్లు అర్జున్ తెలిపారు. రుచి ఆరోగ్యం రెండు కావాలంటే ఫుడ్ లో ఒక క్రమశిక్షణ పాటించాలి అని అల్లు అర్జున్ తెలిపారు. ఏం తిన్నా తక్కువ చేయకూడదు.. అదే విధంగా ఎక్కువ కూడా తినకూడదు. ఒక క్రమశిక్షణ పాటిస్తే సరిపోతుంది. 

జపాన్ లో యావరేజ్ హ్యూమన్ లైఫ్ టైం 84 సంవత్సరాలు ఉంది. ఇండియాలో అయితే 60 ఏళ్ళు మాత్రమే. దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ జపాన్ లో చాలా క్రమశిక్షణ పాటిస్తారు. కొన్ని బెస్ట్ ఫుడ్స్ ని వాళ్ళు తింటారు. జపాన్ ఫుడ్ లో సూశి అనేది ది బెస్ట్ హెల్తీ ఫుడ్ అని చెబుతారు. ఇండియాలో కూడా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఉన్నాయి. తాను ప్రోటీన్ కోసం విదేశాల నుంచి ప్రోటీన్ షేక్స్ తెప్పించుకుంటానని తెలిపారు. అదే విధంగా ఫారెన్ లో ప్రోటీన్ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి. అవి ఇండియాలో దొరకనప్పుడు ఫారెన్ నుంచి తెప్పించుకుంటానని అల్లు అర్జున్ తెలిపారు. అవి కాస్ట్లీగా ఉంటాయట. సినిమాల్లో ఫిజిక్ కోసం అలాంటివి తప్పవు అని బన్నీ తెలిపారు. 

Latest Videos

click me!