బాబోయ్.. బన్నీ వేసుకున్న బ్లాక్ షర్ట్ కు అంత కాస్ట్ పెట్టాడా..? టూమచ్ కదా..?

ఈమధ్య సెలబ్రిటీలు తుమ్మినా.. దగ్గినా కూడా అది వైరల్ న్యూస్ అవుతుంది. అందులో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మన స్టార్స ఏం చేసినా.. అది హైలెట్ అవుతోంది. ఇక కాస్త కాస్ట్లీగా ఏదైనా వస్తువు వాడారంటే.. ఇక రచ్చ రచ్చే.. తాజాగా అల్లు అర్జున్ వేసుకున్న బ్లాక్ షర్ట్ కాస్ట్ ఇలాగే వైరల్ అవుతోంది. 
 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. గ్లోబల్ ఇమేజ్ కూడా సాధించాడు. సినిమా కోసం ఎంతైనా కష్టపడే బన్నీ.. తన స్టైలీష్ లుక్స్ తో మరింతగా ఆకర్శిస్తుంటాడు. ఫ్యాన్స్ బన్నీఅంటే పడి చచ్చిపోతున్నారంటే.. ఆయన మెయింటేనెస్.. స్టైలీష్ లుక్స్.. వాడే బ్రాండెడ్ వస్తువులు. అల్లు అర్జున్ యాటిట్యూడ్.. మొత్తంగా స్టైలీష్ ఐకాన్ గా అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ ఉంది దేశ వ్యాప్తంగా. 

పుష్ప సినిమాల రఫ్ గా.. రగ్డ్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్.. షూటింగ్ అయిపోయిన తరువాత చూడండి.. హాయ్ హ్యాండ్సమ్ అంటూ వెంట పరుగులు పెట్టేలా కనిపిస్తాడు.. 40 ఏళ్లు వచ్చినా..ఇంకా కుర్ర హీరోలా మెరిసిపోతున్న ఐకాన్ స్టార్ కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అంటే నమ్మబుద్ది కాదు మరి. ఇక బన్నీ వాడే వస్తువలు.. గాడ్జెట్స్ అయితే పోటీపడి మరీ.. అలాంటివే కొంటుంటారు ఫ్యాన్స్.. 
 


ఎప్పుడూ ఎదో రకంగా హైలెట్ అవుతూ.. వార్తల్లో నిలుస్తున్నాడు బన్నీ.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాడు. ఆయన వేసుకున్న డ్రస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం.. జర్మనీ వెళ్ళాడు అల్లు అర్జున్. అక్కడ పుష్ప సినిమా స్పెషల్ ప్రీమియర్ లో పాల్గొన్నాడు. అంతే కాదు.. పుష్పాకు సబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా రివిల్ చేశాడు. 
 

అయితే జర్మనీ వెళ్లే ముందు... ఎయిర్ పోర్ట్ లో ఫోటోలకు వరుసగా ఫోజులిచ్చాడు ఐకాన్ స్టార్..  తాజాగా బన్నీ స్వెట్ షర్ట్ లో దర్శనమివ్వగా ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  బ్లాక్ డ్రస్ లో కోబ్రాలా.. మెరిసిపోయాడు.. మరి ఫ్యాన్స్ ఈ డ్రస్ చూసి ఊరుకుంటారా..? వెంటనే ఆన్ లైన్ లో రేటు ఎంత అని వెతికేశారు మరి. ఈ స్వెట్ షర్ట్ ఖరీదు ఏకంగా 28,000 రూపాయలు అని తెలుస్తోంది. బుర్బెరీ మోనోగ్రామ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ను ధరించిన బన్నీ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా మారిపోయాడు. పుష్ప2ను అంతకు మించి చేయాలని పట్టదలతో ఉన్నాడు. ఇక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో... సాలిడ్ అప్ డేట్ కూడా ఇచ్చాడు. ఇండైరెక్ట్ గా.. పుష్ప సిరీస్ లో పార్ట్ 3 కూడా ఉంటుందనే సంకేతం ఇచ్చాడు. . 

దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఎంతో మంది దర్శకులు క్యూలో ఉండగా.. బన్నీతో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తమిళ దర్శఖుడు అట్లీ సినిమాలు కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది

ఇటు పాన్ ఇండియా సినిమాలు చేస్తునే..అటు యాడ్స్ కూడా చేస్తున్నాడు బన్నీ.. ఈమధ్యలో ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయిస్తూ.. హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ నుంచి పుష్ప ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుండగా.. ఈమూవీ నుంచి అప్ డేట్ అయినా ఇవ్వాలని అభిమానులు పట్టుబడుతున్నారు.  ఇక ఈసినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నాడు బన్నీ.. పుష్పరాజ్ లుక్ మేకప్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు.
 

Latest Videos

click me!