బిగ్ బాస్ లో రూ. 35 లక్షలు గెలిచిన పల్లవి ప్రశాంత్, పేద రైతులు ఎంత ఇవ్వనున్నాడో తెలుసా? ఇంత తక్కువా!

First Published | Feb 18, 2024, 6:45 AM IST


పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. తాను టైటిల్ కొడితే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని బిగ్ బాస్ షో వేదికగా మాటిచ్చాడు. రెండు నెలలు అవుతున్నా పల్లవి ప్రశాంత్ డబ్బులు పంచలేదు. దీంతో మాట తప్పాడంటూ విమర్శలు రాగా, స్పందించాడు... 

అనూహ్యంగా ఒక కామనర్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ కి షాక్ ఇస్తూ విజయం సాధించాడు. పల్లవి ప్రశాంత్ కి రైతుబిడ్డ ట్యాగ్ కూడా ప్లస్ అయ్యింది. 

దానికి తోడు పల్లవి ప్రశాంత్ మెరుగైన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఫిజికల్ టాస్క్స్  లో పల్లవి ప్రశాంత్ మెరుపు వేగంతో ఆడేవాడు.పల్లవి ప్రశాంత్ ఉంటే మనం గెలవలేము అని ప్రత్యర్ధులు భావించేవారు. శివాజీ ప్రోత్సాహం తో పాటు తన టాలెంట్ తో పల్లవి ప్రశాంత్ గెలుపు తీరాలు చేరుకున్నారు. 


టైటిల్ గెలిస్తే... ప్రైజ్ మనీ ఏం చేస్తారని నాగార్జున అడగ్గా... కంటెస్టెంట్స్ అందరూ తమ వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేస్తామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ మాత్రం.. పేద రైతులకు పంచిపెడతాని మాటిచ్చాడు. ఇది కూడా అతనిపై జనాలకు అభిమానం కలిగేలా చేసింది. 

Pallavi Prashanth

కాగా పల్లవి ప్రశాంత్ ఫైనల్ లో సత్తా చాటాడు. అమర్ దీప్ ని వెనక్కి నెట్టి విన్నర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ కి రూ. 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, రూ. 15 లక్షల విలువైన కారు బహుమతులుగా వచ్చాయి. ముందుగా చెప్పిన ప్రకారం పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు పేదలకు పంచాల్సి ఉంది. 
 

బిగ్ బాస్ షో ముగిసి రెండు నెలలు అవుతున్నా పల్లవి ప్రశాంత్ డబ్బులు పంచలేదు. దీంతో మాట తప్పాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా త్వరలో డబ్బులు పంచుతున్నట్లు వెల్లడించాడు. 

ప్రాణం పోయినా ఇచ్చిన మాట మరువను. దాని కోసం ఎంత దూరం అయినా వెళతాను. పేద రైతులకు బిగ్ బాస్ మనీ పంచేందుకు త్వరలో మీ ముందుకు వస్తున్నా... అని కామెంట్ పెట్టాడు. పల్లవి ప్రశాంత్ పోస్ట్ విమర్శలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. 

కాగా యావర్ రూ. 15 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు పల్లవి ప్రశాంత్ కి ఇచ్చారు. ఇందులో మరలా పన్నుల కోత ఉంటుంది. అవన్నీ పోగా రూ. 16 లక్షలు మాత్రమే ఉంటాయి. ఈ పదహారు లక్షలు పల్లవి ప్రశాంత్ పేద రైతులు ఇవ్వనున్నాడన్న మాట... 
 

Latest Videos

click me!