ఐబొమ్మ రవిని పట్టుకుంది పోలీసులు కాదా?, ఆయన అరెస్ట్ వెనకాల ఉన్నది ఎవరు? షాకిచ్చే విషయాలు

Published : Nov 17, 2025, 08:44 PM IST

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులకు ఎవరు పట్టించారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఆ విషయం ఏంటంటే?  

PREV
15
ఐబొమ్మ సైట్‌ క్లోజ్‌

పైరసీ కేటుగాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అరెస్ట్ అయ్యాడు. శనివారం అరెస్ట్ అయిన రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా హెచ్‌డీ సినిమాలను పైరసీ చేసి చిత్ర పరిశ్రమకి కోట్లు నష్టం తీసుకొస్తున్న ఐబొమ్మ రవి కథ ముగిసింది. అదే సమయంలో ఐబొమ్మ సైట్‌ కూడా క్లోజ్‌ అయ్యింది. ఈ సైట్‌ని ఇక శాశ్వతంగా మూసేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ ఐబొమ్మ సైట్‌ని క్లిక్‌ చేయగా, ఇక ఇండియాలో దీని సేవలను క్లోజ్‌ చేస్తున్నట్టు వస్తోంది.

25
`వారణాసి` ఈవెంట్‌ పైరసీ కోసం హైదరాబాద్‌ వచ్చాడా?

ఇదిలా ఉంటే ఐబొమ్మ రవిని ఎవరు పట్టుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో సరికొత్త విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఐబొమ్మ రవి.. శనివారం జరిగిన రాజమౌళి, మహేష్‌ బాబు సినిమా `వారణాసి` మూవీ ఈవెంట్‌ కోసం వచ్చాడని అంటున్నారు. ఈ ఈవెంట్‌ని అక్రమంగా షూట్‌(పైరసీ) చేయడానికి ఆయన ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కి వచ్చినట్టు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ విషయం పోలీసులకు తెలిసి పక్కా ప్లాన్‌తో పట్టుకున్నట్టు ఓ వార్త వైరల్‌ అవుతుంది. కానీ ఇందులో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

35
ఐబొమ్మ రవిని భార్యనే పట్టించిందా?

ఐబొమ్మ రవిని తన భార్యనే పట్టించిందట. రవి కరేబియన్‌ దీవుల్లోని సెయింట్‌ నేవీ దేశం పౌరసత్వం ఉన్నట్టు సోమవారం ప్రెస్‌ మీట్‌లో సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేశాడని, ఐ బొమ్మ ద్వారా వన్‌ విన్‌, వన్‌ ఎక్స్ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో ఉన్నాడట. అయితే గత కొన్ని రోజులుగా తన భార్యతో రవికి పడటం లేదు. ఇద్దరి మధ్య చాలా కాలంగా గొడవలు అవుతున్నాయి. అది విడాకుల వరకు వెళ్లింది. విడాకుల కోసమే రవి.. ఫ్రాన్స్ నుంచి పిలిపించిందట భార్య.

45
భార్యతో విడాకులు తీసుకునేందుకు రవి వచ్చాడా?

భార్యతో విడాకుల కోసం రవి హైదరాబాద్‌ వచ్చాడని, భార్యనే పోలీసులకు ఈ సమాచారం అందించిందని, దీంతో పోలీసులు పక్కగా ప్లాన్‌ చేసి కూకట్‌పల్లిలోని తన అపార్ట్ మెంట్‌లోనే అతన్ని పట్టుకున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై ఈ ఉదయం సజ్జనార్‌ క్లారిటీ ఇచ్చారు. తమ పోలీసు యంత్రాంగమే గత కొన్ని నెలలుగా ఇన్విస్టిగేట్‌ చేసి, పక్కా ప్లాన్‌తో రవిని పట్టుకున్నట్టు సీపీ తెలిపారు. ఈ మేరకు పోలీసు టీమ్‌కి అభినందనలు తెలిపారు. దీంతో రవి భార్య ప్రమేయం లేదని అర్థమవుతుంది. కానీ దీని వెనకాల సెక్యూరిటీ కారణాలు కూడా ఉండొచ్చు. కారణాలు ఏవైనా, పట్టించింది ఎవరైనా సినిమా పరిశ్రమకి కోట్ల నష్టం తీసుకొస్తున్న ఐబొమ్మ రవి దొరికిపోవడంతో చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.

55
రవిది ప్రేమ పెళ్లి, ఓ కూతురు కూడా ఉంది

ఇదిలా ఉంటే రవి హైదరాబాద్‌లోనే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. తన పెద్ద అల్లుడే రవి వివాహం జరిపించాడట. హైదరాబాద్‌లోనే పెళ్లి జరిగిందన్నారు రవి తండ్రి. అమ్మాయికి పెద్ద ఉద్యోగం ఉందట. పెళ్లి తర్వాత ఓ అమ్మాయి కూడా పుట్టిందట. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఈ గొడవల గురించి మాట్లాడటానికి హైదరాబాద్‌ రావాలని కోడలు పదే పదే రవి తండ్రికి ఫోన్‌ చేసిందట. తాను రాలేనని, అక్కడ చెప్పేదే ఫోన్‌లో చెబుతున్నట్టు తెలిపారు. ఇద్దరు కలిసి ఉండాలని చాలా సార్లు చెప్పాడట. కానీ తన మాట వినడం లేదని తాజాగా తండ్రి తెలిపారు. ఈ క్రమంలో విడాకుల కోసం రవి భార్యనే పిలిపించి ఆయన్ని పోలీసులకు పట్టించిందనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే కొడుకు అరెస్ట్ పై తండ్రి అప్పారావు స్పందిస్తూ అతను చేసింది పనికిమాలిన పని దాన్ని తాను సమర్థించను అన్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్‌ విసిరితే వాళ్లు ఊరుకుంటారా? ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని, చట్టం తన పని తాను చేస్తుందని చెప్పడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories