పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి చెప్పిన దిమ్మ తిరిగే నిజాలు ఇవే.. అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా ?

Published : Nov 20, 2025, 09:34 PM IST

Ibomma Ravi: ఐబొమ్మ రవి పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయట పెట్టాడు. సినిమాని పైరసీ చేయడం నుంచి ఏజెంట్లకు పేమెంట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా రవి బయటపెట్టాడు. 

PREV
15
ఐబొమ్మ రవి పైరసీ సామ్రాజ్యం 

ఐబొమ్మ వైబ్ సైట్ ద్వారా రవి ఒక పెద్ద పైరసీ సామ్రాజ్యాన్నే సృష్టించాడు. ఇన్నేళ్లు పైరసీ సినిమాలతో డబ్బు సంపాదించిన రవి ఎట్టకేలకు కటకటాల వెనక్కి వెళ్ళాడు. గతంలో పలు మాటలు పోలీసులకే రవి ఛాలంజ్ విసిరిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ చివరికి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ అయ్యాడు. కాగా పోలీస్ కస్టడీలో రవి విచారణ తొలి రోజు ముగిసింది. 

25
పోలీసుల విచారణ 

పోలీసుల విచారణలో రవి మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపెట్టాడట. నేరస్థులు సాధారణంగా నిజాలు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు.  కానీ రవి మాత్రం తన నెట్ వర్క్ గురించి పూస గుచ్చినట్లు పోలీసులకు వివరించాడట. అసలు సినిమా పైరసీ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది ? దానిని మంచి క్వాలిటీ లోకి ఎలా తీసుకువస్తారు ? ఏజెంట్లు ఎలా పనిచేస్తారు ? ఎలా సినిమాని సైట్ లో అప్లోడ్ చేస్తారు లాంటి విషయాలని రవి ఇంటరాగేషన్ లో రివీల్ చేశాడు. 

35
నిజాలు మొత్తం బయట పెట్టిన రవి 

ముందుగా రవి బ్యాంకింగ్ ఖాతాలపై ఆరా తీసారట. రవి పెద్ద ఎత్తున ఐబొమ్మ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా నెదర్లాండ్స్ లో ఉన్న తన నెట్వర్క్ సర్వర్ల గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. సినిమా రిలీజైన వెంటనే ఏజెంట్లు ఎలా రికార్డ్ చేస్తారు ? ఆ తర్వాత వాటిని ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి క్వాలిటీ పెంచుతారు అనే విషయాన్ని కూడా రవి పోలీసులకు వివరించాడట. 

45
రిలీజ్ కి ముందే పైరసీ 

సినిమా ప్రింట్ క్వాలిటీని బట్టి ఏజెంట్లకు పేమెంట్ ఉంటుందని.. తన వద్ద సర్వర్లని హ్యాక్ చేసి రిలీజ్ కి ముందే సినిమాని పైరసీ చేసే ఏజెంట్లు కూడా ఉన్నారని.. వాళ్లకు పేమెంట్ అధికమొత్తంలో ఉంటుందని రవి తెలిపారు. ఒక సైట్ నుంచి మరో సైట్ కి రీ డైరెక్ట్ కావడం, ఒక లింక్ ని బ్లాక్ చేస్తే ఐపీ అడ్రెస్ మార్చి మరో మిర్రర్ సైట్ క్రియేట్ చేయడం ఇదంతా తన ఓన్ టెక్నాలజీతో పని చేసినట్లు రవి పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. 

55
రవికి బెయిల్ వస్తుందా ?

మొత్తంగా తొలి రోజు విచారణలో రవి పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రవి తరుపున న్యాయవాది  చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రవిపై ఉన్నవి బెయిలబుల్ కేసులే అని.. త్వరలోనే రవికి బెయిల్ వస్తుంది అని ఆయన చెప్పడం అసలైన ట్విస్ట్. 

Read more Photos on
click me!

Recommended Stories