Illu Illalu Pillalu Today Episode Nov 20: విశ్వ ప్రేమలో అమూల్య, ప్రేమికులిద్దరినీ చూసేసిన వేదవతి

Published : Nov 20, 2025, 09:12 AM IST

Illu Illalu Pillalu Today Episode Nov 20: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో విశ్వ, అమూల్య ఒకే బైక్ పై వెళుతూ వేదవతి కంటపడతారు. విశ్వ ప్రేమలో అమూల్య పడిపోతుంది. ఇక ఈఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.  

PREV
15
జాగింగ్ కు ప్రేమ, ధీరజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ధీరజ్, ప్రేమ జాగింగ్ కోసం తెల్లవారుజామున లేచి రెడీ అవుతారు. ఇక నర్మదా, సాగర్ కూడా గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇద్దరూ బయటికి వచ్చేసరికి వల్లి ఇంటి గుమ్మంలో ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. మళ్ళీ అదే సమయంలో రామరాజు కూడా పేపర్ కొనుక్కొని ఇంటికి వస్తారు. దీంతో వాళ్ళకి కనబడకుండా ఎలా వెళ్లాలో తెలియక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు నర్మదా, సాగర్. ప్రేమ..వెస్ట్రన్ డ్రెస్ లో ఉండడంతో ఇంట్లోకి తీసుకెళ్లి ఒక చీరను ఇచ్చి కట్టుకోమని చెబుతాడు ధీరజ్. అలా ఇద్దరూ ఇంట్లోంచి జాగింగ్ కోసం బయటికి వెళ్లేందుకు ప్లాన్ వేస్తారు. అక్కడే ఉన్న రామరాజు వాళ్ళని ఆపుతాడు. గుడికి వెళుతున్నామని ధీరజ్ చెబుతాడు. నువ్వు ఎప్పుడూ గుడికి వెళ్లవు కదా.. ఎంత ఉదయాన్నే గుడికి ఏమిటని ప్రశ్నిస్తాడు. రామరాజు ఇద్దరినీ వెళ్లి రమ్మని చెబుతాడు.

25
గోడ దూకిన సాగర్ నర్మద

వల్లి... ధీరజ్, ప్రేమ వెళ్లడం చూస్తుంది. వాళ్ళిద్దరూ కాలికి షూ వేసుకోవడం చూసి ఇద్దరినీ ఆగమంటుంది. ప్రేమతో చీర కట్టుకున్నావా.. చుట్టేసావా? ఏదో తేడా కొడుతుందే అంటుంది. కానీ రామరాజు ఏం తేడా లేదు వెళ్ళనివ్వమని చెబుతాడు. దాంతో ప్రేమ, ధీరజ్ వెళ్ళిపోతారు. ఇక నర్మదా, సాగర్ గోడ దూకడానికి ప్రయత్నిస్తారు. అది వల్లి చూసేస్తుంది. దాంతో వారు కూడా అక్కడే ఆగాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తుంది. వల్లి.. సాగర్ ఇంత పొద్దున లేవడు కదా అని అంటుంది. ఈలోపు నర్మద మాట్లాడుతూ మావయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళు అని అంటుంది. వల్లీ తనకు వినబడలేదని చెబితే.. నర్మదా మాకైతే వినిపించింది ఇంతకుముందే కోడలు అంటే నీలా ఉండాలని పొగిడారు కదా ఇప్పుడు వెళ్ళలేదనుకో పొగరు అనుకుంటారు ఇక నీ ఇష్టం అంటుంది. దాంతో వల్లి మావయ్య గారి దృష్టిలో పడడానికి పరిగెడుతుంది. ఈలోపు నర్మదా సాగర్ కలిసి గోడ దూకేస్తారు. ఇద్దరు గుడికి వెళ్లి పూజలు చేసుకుంటారు.

35
భర్తగా గెలుస్తానన్న సాగర్

గుడిలో నర్మదా, సాగర్ మాట్లాడుతూ ఉంటారు. నర్మదా భర్తతో నువ్వు కచ్చితంగా ఈసారి విఆర్వో అవుతావు అని అంటుంది. అప్పుడు సాగర్ కూడా సంతోషంగా ‘ఈ జాబ్ నాకు వస్తే భర్తగా నేను గెలిచినట్టే.. మీ నాన్న కూడా ఎంతో సంతోషిస్తారు. కూతురు లాగే అల్లుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని పొంగిపోతారు. మీ నాన్న నన్ను అల్లుడుగా అంగీకరించకపోవడానికి కారణం నేను రైస్ మిల్లులో పనిచేయడం. ఒక్కగానొక్క కూతురిని ఇంటికి రానివ్వకపోవడానికి కారణం గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నువ్వు... రైస్ మిల్లులో పనిచేస్తున్న నన్ను పెళ్లి చేసుకోవడమే. అదే నాకు ఇప్పుడు జాబ్ వచ్చిందనుకో మీ నాన్న గర్వంగా చెప్పుకుంటారు. నిన్ను సంతోషంగా ఇంటికి రానిస్తారు. మన పెళ్లి వల్ల నీ పుట్టింటి వాళ్ళు దూరమయ్యారు. వారిని తిరిగి దగ్గర చేస్తే నేను భర్తగా గెలిచినట్టే కదా’ అని అంటాడు సాగర్. దానికి నర్మదా సాగర్ ని చూసి ఆనందపడుతుంది. ‘నాకు కన్నీళ్లు వచ్చాక చూడడం కాదు.. నాకు కన్నీళ్లు రాకుండా చూసుకుంటావన్న నమ్మకమే నీతో ఏడు అడుగులు నడిచేలా చేసింది’ అని సాగర్ తో అంటుంది.

45
విశ్వ బైక్ పై అమూల్య

ఇక్కడ నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. అమూల్య ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరడం విశ్వా చూస్తాడు. ఇక విశ్వా కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. అమూల్య వెంటే బైక్ పై బయలుదేరుతాడు. అమూల్య కాలేజీకి నడుచుకుంటూ వెళుతుంటే ఆమె వెనకే వెళ్లి పిలుస్తాడు. కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను రమ్మని చెబుతాడు. అమూల్యను అడ్డుపెట్టుకొని రామరాజుని మానసికంగా హింసించి చంపాలన్నదే విశ్వ ప్లాన్. విశ్వ బైక్ ఎక్కమని ఎంత అడిగినా అమూల్య అక్కర్లేదని చెబుతుంది. విశ్వ మాత్రం ఫాలో అవుతూనే ఉంటాడు. అయితే అమూల్య.. విశ్వ ఇచ్చిన చైన్ వేసుకుంటుంది. అది చూసి విశ్వ ఆనందపడతాడు. అమూల్య కూడా చిన్నగా నవ్వి విశ్వ బైక్ ఎక్కుతుంది. తన ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు విశ్వ ఎంతో ఆనందిస్తాడు. వారిద్దరూ అలా బైక్ పై వెళుతుండగా అట్నుంచి రామరాజు వేదవతి కూడా వస్తూ ఉంటారు. విశ్వమాత్రం మనసులో ‘అమూల్య నువ్వు నా ట్రాప్ లో పూర్తిగా పడిపోయావు. ఇక మీ నాన్నకు రక్త కన్నీరే’ అని అనుకుంటూ ఉంటాడు.

55
అమూల్యను చూసేసిన వేదవతి

ఈలోపు రామరాజు బైకు.. విశ్వ బైకు పక్కనుంచే వెళ్తాయి. కానీ రామరాజు ఆ విషయాన్ని గమనించడు. వేదవతి మాత్రం అమూల్యను చూస్తుంది. కానీ అమూల్య చున్నీతో ముఖాన్ని కప్పేసుకుంటుంది. వేదవతికి మాత్రం అనుమానం వచ్చి అలా చూస్తూనే ఉంటుంది. అమూల్య కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. అమ్మ చూసేసిందేమోనని ఆలోచిస్తూ ఉంటుంది అమూల్య. వేదవతి కూడా అమూల్య వేసుకున్న డ్రస్సును పోలుస్తుంది. దాంతో విశ్వ బండి మీద ఉన్నది అమూల్యేనని వేదవతికి నమ్మకం కుదురుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories