
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో హోమానికి సంబంధించిన పనులు చేస్తుంటాడు దశరథ. ఇవన్నీ నీకెందుకు దశరథ.. కార్తీక్ కి చెప్తే చేస్తాడు కదా అంటాడు శివన్నారాయణ. వాడిని కుటుంబంతో సహా హోమానికి రమ్మని గౌరవంగా పిలిచాం. అంతే గౌరవంగా చూసుకోవాలి. వాడికి ఈ పనులు చెప్పకూడదు అంటాడు దశరథ. మీరు కూడా బంధువుల లాగా ఇప్పుడు కిందకు వస్తే ఎలా అత్తయ్య అని పారుతూ అంటుంది సుమిత్ర. జ్యోత్స్న నువ్వు ఇక్కడే ఉండు మీ మామయ్య వాళ్లు వచ్చే టైం అయింది అని చెప్పి బయటకు వెళ్తుంది సుమిత్ర.
గురువు గారు ఇంకా రాలేదు కదా.. అని భర్తను అడుగుతుంది సుమిత్ర. నేను కారు పంపించాను. ఆయన ముహూర్తం అవి చూసుకొని బయలుదేరుతాడు సుమిత్ర అంటాడు దశరథ. మనం అనుకున్నట్లు హోమం చక్కగా జరిగితే చాలు అంటాడు శివన్నారాయణ. నువ్వు కోరుకున్నట్లు హోమం చక్కగా జరిగి.. అన్ని సంతోషాలు మన వాకిలి ముందుకు వస్తాయి తాత అంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుంది.
సంతోషంగా వారిని రిసీవ్ చేసుకోవడానికి ముందుకు వస్తారు శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు. అందరూ ఒకరిని ఒకరు పలకరించుకుంటారు. శౌర్య ముద్దుల తాతయ్య అంటూ శివన్నారాయణ దగ్గరకు వెళ్తుంది. శౌర్యను చూసి సంతోషిస్తున్న సుమిత్రతో నీకూ మనుమళ్లు వస్తారు లే అంటుంది పారు. శౌర్య కూడా నా మనుమరాలే కదా అంటుంది సుమిత్ర.
అనుకోవడానికి, కావడానికి మధ్య చాలా తేడా ఉంది అంటుంది పారు. జ్యోత్స్నకు పెళ్లే కాలేదు. నువ్వు పిల్లల గురించి మాట్లాడుతున్నావా పారు అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. తర్వాత కావేరీని బాగున్నావా వదిన అని అడుగుతుంది సుమిత్ర. ఎమోషనల్ అవుతుంది కావేరి. జరిగిన గతాన్ని మర్చిపోయి అందరం ఇలాగే సంతోషంగా ఉండాలి అంటాడు శివన్నారాయణ.
జ్యోత్స్న ముత్తైదువుల కాళ్లకు పసుపు రాయాలి. నీతో రాయిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను అని చెప్తుంది సుమిత్ర. రాస్తాను మమ్మీ అంటుంది జ్యోత్స్న. ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది అని మనసులో అనుకుంటుంది పారు. ఇంట్లో ఉన్నవాళ్లకు నేను రాశాను. నువ్వు ఈ నలుగురితో పాటు మీ నానమ్మకు రాస్తే చాలని చెప్తుంది సుమిత్ర. ముత్తైదువు అంటే ఎవరు మమ్మీ అని అడుగుతుంది జ్యోత్స్న.
ఐదోతనం ఉన్న వాళ్లందరూ ముత్తైదువులే అంటుంది సుమిత్ర. నీ భర్త నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ముత్తైదువే మమ్మీ, అలాగే గ్రానీ భర్త గ్రానీతో ఉన్నాడు. దీప, స్వప్నలతో కూడా వాళ్ల భర్తలున్నారు వాళ్లు ముత్తైదువులే. కానీ.. అత్తతో భర్త లేడుగా అని చిన్నగా గొడవ స్టార్ట్ చేస్తుంది జ్యోత్స్న. అత్తకు, మామయ్యకు బంధువుల మధ్య ఘనంగా పెళ్లి జరిగింది. కానీ గుడిలో సీక్రెట్ గా జరగలేదు అని ఇన్ డైరెక్ట్ గా కావేరిని అంటుంది జ్యోత్స్న. శ్రీధర్ ఎవరంటే కాంచన భర్త, కార్తీక్ తండ్రి అంటారు కానీ.. కావేరి భర్త, స్వప్న తండ్రి అనరు అంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్నను ఆపే ప్రయత్నం చేస్తుంది దీప. మరింత రెచ్చగొడుతుంది పారు. నీకు కొంచమైనా బుద్ధి ఉందా పిన్ని అని పారుపై సీరియస్ అవుతుంది కాంచన. నువ్వు త్యాగం చేసినంత మాత్రాన వీళ్లకు గుర్తింపు రాదు అంటుంది జ్యోత్స్న. పచ్చిగ మాట్లాడాలంటే ఈవిడను ఉంపుడుగత్తె అంటారు అని నీచంగా మాట్లాడుతుంది జ్యో. కోపంతో చేయి ఎత్తుతుంది సుమిత్ర. ఆపుతుంది కావేరి. తప్పు నాదే. రమ్మని పిలవగానే రాను అని చెప్పాల్సింది. నా బతుకే సక్రమమైంది కాదు అని కావేరీ బాధపడుతుంది. ఇంటికి వచ్చి రమ్మని పిలిచింది.. వాకిట్లో నిలబెట్టి అవమానించడానికేనని ఇప్పుడు అర్థమైంది అని ఏడుస్తూ తల్లిని తీసుకొని వెళ్లిపోబోతుంది స్వప్న.
అదే సమయంలో శివన్నారాయణ, కార్తీక్ కలిసి వస్తారు. ఎందుకు ఏడుస్తున్నావ్ చెప్పు అని స్వప్నను అడుగుతాడు కార్తీక్. అమ్మ గురించి జ్యోత్స్న చాలా నీచంగా మాట్లాడింది అన్నయ్య. ఇప్పటి వరకు ఎవ్వరు అలా మాట్లాడలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది స్వప్న. మా చిన్నమ్మను ఏమన్నావ్ అని జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు కార్తీక్. తను అలా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అని సుమిత్రను అడుగుతాడు దశరథ. కొట్టబోతే కావేరీ వదిన ఆపింది. లేదంటే దాని చెంప పగలగొట్టేదాన్ని అంటుంది సుమిత్ర.
అత్త కొట్టాలి అనుకుందంటే నువ్వు ఎంత పెద్ద మాట అన్నావో నేను ఊహించగలను. మేమంతా ఒకే కుటుంబం. మాకు లేని బాధ నీకెందుకు? నచ్చితే మాట్లాడు లేదంటే మానేయ్. అంతే కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను అంటాడు కార్తీక్. తాత అందరూ కలవాలన్న నీ సంకల్పాన్ని నేను గౌరవిస్తాను కానీ.. జ్యోత్స్న మా చిన్నమ్మకు, చెల్లికి సారీ చెప్పాలి అంటాడు కార్తీక్. జ్యోపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. కావేరికి సారీ చెప్పు అని గట్టిగా గద్దిస్తాడు. సారీ అత్త, ఏదో తెలియక మాట్లాడాను అంటుంది జ్యోత్స్న. ముందు కావేరి అత్త కాళ్లకు పసుపు రాయమని జ్యోత్స్నతో చెప్తుంది సుమిత్ర. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.