దగ్గుబాటి లక్ష్మి సైతం రెండో వివాహం చేసుకుని చెన్నై లో సెటిల్ అయ్యింది. నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు నాన్న నాగార్జున వద్దకు వస్తూ ఉండేవాడట. పెద్దయ్యాక నాగచైతన్యను నాగార్జునే హీరోగా లాంచ్ చేశాడు. అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయం చేశాడు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ చిత్రం 2009లో విడుదలైంది.