23 ఏళ్ల వయసులో ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డాను... పెళ్ళికి ముందు పెట్టుకున్న ఎఫైర్ బయటపెట్టిన ఎన్టీఆర్!

First Published Jun 20, 2024, 7:25 PM IST

స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ ఓ  ముంబై హీరోయిన్ వలలో పడ్డాడు. వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్న ఎన్టీఆర్.. ఆమెను ఇష్టపడ్డాక జరిగిన పరిణామాలు ఏమిటో చెప్పాడు. పెళ్ళికి ముందు ఎన్టీఆర్ ఇంత తతంగం నడిపాడా అని ఫ్యాన్స్ వాపోతున్నారు.

NTR

బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అనేది సామెత. నచ్చిన అమ్మాయి ఎదురైనప్పుడు మనసు గతి తప్పుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ బిగినింగ్ లో ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. సదరు హీరోయిన్ తో ఎన్టీఆర్ ఎఫైర్ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. 
 

NTR

కాగా ఓ సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా తన ఎఫైర్ వార్తలపై స్పందించారు. అవును నేను ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డాను అన్నాడు. గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఇంటర్ చదివే రోజుల్లో ఏమైనా ప్రేమలు గట్రా ఉన్నాయా అని యాంకర్ అడగ్గా... ఎందుకు ఉండవు. ఆ ఏజ్ లో ఖచ్చితంగా ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి. అవన్నీ కాలంతో పాటు వచ్చి వెళ్లిపోతుంటాయి అని ఎన్టీఆర్ అన్నారు. 
 

సినిమా చాలా అట్రాక్టివ్ ఫీల్డ్. మరి హీరో అయ్యాక ఎవరి పట్ల అయిన ఆకర్షితుడివి అయ్యావా? అని అడగ్గా... ఉన్నారు ఒకరు. అప్పట్లో బాగా అనుకున్నారు కదా ఆమెనే. అప్పుడు నా వయసు కేవలం 23 ఏళ్ళు. ఒక దశలో ఇష్టం పడ్డాం. తర్వాత ఎందుకు అనిపించింది. బయటకు వచ్చేశాను, అని ఎన్టీఆర్ అన్నాడు.

ఆ హీరోయిన్ ని ఇష్టం పడినందుకు పశ్చాత్తాప పడ్డావా? అని యాంకర్ అడగ్గా... లేదు. ఎందుకంటే నేను జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకు తీసుకున్నానా అని ఎప్పుడూ ఫీల్ అవను. జీవితంలో ఒక పరిణామం జరిగింది. పర్సనల్ లైఫ్ తో ప్రొఫెషన్ ని లింక్ చేయకూడదు. వాటిని వేరు వేరుగా చూడాలి, అన్నాడు ఎన్టీఆర్. 
 

NTR

ఇక్కడ ఎన్టీఆర్ చెప్పిన హీరోయిన్ సమీరా రెడ్డి. 2005లో బి గోపాల్ దర్శకత్వం వహించిన నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి జతకట్టారు. ఆ మూవీ షూటింగ్ లో ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ మూవీ డిజాస్టర్ కాగా నెక్స్ట్ మూవీలో కూడా సమీరా రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్ సైతం రాలేదు. అశోక్ అనంతరం ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసి నటించలేదు. 

NTR

ఆ సమయంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి మధ్య ఎఫైర్ అంటూ పుకార్లు గట్టిగా వినిపించాయి. సమీరా రెడ్డి టాలీవుడ్ కి దూరం కావడానికి ఈ పుకార్లు కూడా కారణం. అసలు ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడని, హరికృష్ణ మందలించి ఆపేశాడనే వాదన కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ ఓ సందర్భంలో సమీరా రెడ్డిని ఇష్టపడినట్లు పరోక్షంగా చెప్పాడు.. 

Latest Videos

click me!