రష్మిక మందన్నాని స్పాట్‌లో పెట్టి ఆడుకున్న ఆనంద్‌ దేవరకొండ.. నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ పర్సనల్‌ విషయాలు లీక్‌

Published : May 27, 2024, 11:18 PM IST

ఆనంద్‌ దేవరకొండ.. హీరోయిన్‌ రష్మిక మందన్నా స్పాట్‌లో పెట్టి ఆడుకున్నారు. `గం గం గణేశా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తమ పర్సనల్‌ విషయాలను లీక్‌ చేశారు.   

PREV
16
రష్మిక మందన్నాని స్పాట్‌లో పెట్టి ఆడుకున్న ఆనంద్‌ దేవరకొండ.. నువ్వు నా ఫ్యామిలీ రా అంటూ పర్సనల్‌ విషయాలు లీక్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని అటు ఇండస్ట్రీ, ఇటు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. దీనికితోడు రష్మిక కూడా తరచూ ఆ హింట్లు ఇస్తూనే ఉంది. నిత్యం ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక మందన్నా ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న `గం గం గణేశా` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో గెస్ట్ గా పాల్గొంది. 
 

26

ఈ సందర్భంగా రష్మిక మందన్నా, ఆనంద్‌ దేవరకొండ మధ్య ఆసక్తికర కన్వర్జేషన్‌ జరిగింది. రష్మిక మందన్నాని స్పాట్‌లో పెట్టి ఆడుకున్నాడు ఆనంద్‌ దేవరకొండ. పర్సనల్‌ విషయాలను ప్రశ్నించాడు. ప్రమోషన్‌ కోసం చేసిన స్టంట్‌ లో భాగంగా ఆవేశంలో పర్సనల్‌ విషయాలను బయటపెట్టారు ఇద్దరూ. రష్మిక మందన్నా ఇటీవల తన పెట్‌ డాగ్స్, క్యాట్‌లతో ఫోటోలను పెట్టింది. వాటిలో ఫేవరేట్‌ ఏంటి అనగా ఆరా తన ఫస్ట్ బేబీ అని, క్యాట్‌ సెకండ్‌ బేబీ అని తెలిపింది రష్మిక మందన్నా. 

36

అనంతరం మీరు చాలా ప్రదేశాలకు ట్రావెల్‌ చేస్తుంటారు. అందులో మీకిష్టమైన ప్రదేశం ఏది అనగా, వియత్నాం అని చెప్పింది రష్మిక మందన్నా. అక్కడ తనకు చాలా గుడ్‌ మెమరీస్‌ ఉన్నాయని తెలిపింది రష్మిక మందన్నా. అనంతరం మీ ఫేవరేట్‌ కోస్టార్‌ ఎవరు అని అడిగాడు ఆనంద్‌. దీంతో ఆనంద్‌ నువ్వు నా ఫ్యామిలీరా ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని నవ్వులు చెప్పడం విశేషం. దీంతో వెనకాల నుంచి అభిమానుల నుంచి రౌడీ రౌడీ అనే స్లోగల్‌ వినిపించింది. రష్మిక కూడా రౌడీబాయ్‌ అని చెప్పేసింది.

46

మరోసారి స్పాట్‌లో పెట్టాడు ఆనంద్‌. మీరు చాలా ప్రదేశాలకు వెళ్తారు, వెళ్లినప్పుడు చాలా ఫోటోలను తీస్తారు. ఫ్రెండ్స్ తీస్తారు, నేను తీస్తాను, మీరు తీస్తారు. వీరిలో మీ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌ ఎవరు అని అడిగాడు ఆనంద్‌. అంతేకాదు ఒకటి రెండు ఫోటోలు కూడా చూపించారు. ఈ ఫోటోలు ఎవరు తీశారని ఇరుకున పెట్టాడు ఆనంద్‌. అంతేకాదు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఫ్రెండ్స్ పేర్లతోపాటు తన పేరు, విజయ్‌ పేరు కూడా చెప్పాడు. 
 

56

దీనికి రష్మిక మందన్నా స్పందిస్తూ, నేనే బెస్ట్ ఫోటోగ్రాఫర్‌ అని, ఎన్ని బెస్ట్ ఫోటోస్‌ తీసిన, ఒక్క క్రెడిట్‌ అయినా ఇచ్చినవా నాకు అంటూ నిలదీసింది రష్మిక. నీ ఫోటో కూడా తీశానని తెలిపింది. అందరి ఫోటోలు తీశాను, ఎవరూ నాకు క్రెడిట్‌ ఇవ్వరు అంటూ నిలదీసింది రష్మిక మందన్నా. ఈ క్రమంలో ఆమె తమ మధ్య ఉన్న ఫ్యామిలీ బాండింగ్‌, పర్సనల్‌ విషయాలు లీక్‌ చేసేశారు. నువ్వు నా ఫ్యామిలీ రా అనేది, కలిసి ట్రావెల్‌ చేస్తారనేది, అలాగే ఫోటోలు తీయడం అనేది ఇలా పలు అంశాల్లో తమ పర్సనల్‌ విషయాలను లీక్‌ చేసి, విజయ్‌, రష్మిక మందన్నా ఘాటు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఓ రకంగా బహిర్గతం చేశారని చెప్పొచ్చు.  
 

66

 ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ కారుమంచి, కేదార్‌ సెలగం శెట్టితో కలిసి ఆయన నిర్మించారు. యాక్షన్‌ క్రైమ్‌ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ నెల 31న విడుదల కాబోతుంది.  ఈ క్రమంలో సోమవారం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి రష్మిక గెస్ట్ గా వచ్చి టీమ్‌ని విష్‌ చేసింది. ఇందులో ఆనంద్‌, రష్మిక మధ్య కన్వర్జేషన్‌ హైలైట్‌గా నిలిచింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories