చరణ్-జాన్వీ కాంబోలో జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2... ఓపెన్ అయిన చిరంజీవి!

Published : Apr 13, 2024, 07:21 AM ISTUpdated : Apr 13, 2024, 07:30 AM IST

చిరంజీవి తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్, చరణ్ లపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.   

PREV
17
చరణ్-జాన్వీ కాంబోలో జగదేకవీరుడు అతిలోకసుందరి పార్ట్ 2... ఓపెన్ అయిన చిరంజీవి!
Chiranjeevi


సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 

27

తనను ప్రేక్షకులు మాస్ కమర్షియల్ చిత్రాల్లోనే చూడటానికి ఇష్టపడతారని చిరంజీవి అన్నారు. రుద్రవీణ మూవీ వలన నాకు మంచి పేరొచ్చింది. కానీ నిర్మాతగా ఉన్న నా తమ్ముడు నాగబాబు నష్టపోయాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం దంగల్ వంటి చిత్రాలు చేయవచ్చుగా అని ఒకసారి సలహా ఇచ్చారు.

37
Chiranjeevi

నిర్మాతలు నష్టపోతారు. ప్రేక్షకులు నేను మాస్ కమర్షియల్ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు. వాటినే చూస్తారు, అని చెప్పాను. ఖైదీ మూవీ నాకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలోని డాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయని చిరంజీవి అన్నారు.

47

కాగా జాన్వీ కపూర్-చరణ్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉందనే కోరిక బయటపెట్టాడు చిరంజీవి. ఆయనమాట్లాడుతూ ... ఇటీవల జాన్వీ కపూర్ ని కలిశాను. ఆమెను చూసిన వెంటనే శ్రీదేవి గుర్తుకు వచ్చింది. భావోద్వేగానికి గురయ్యాను. 

57
Chiranjeevi

శ్రీదేవి మరణంతో చిత్ర పరిశ్రమ మంచి నటిని కోల్పోయింది. రామ్ చరణ్- జాన్వీ కపూర్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉంది. అది నా కోరిక... అన్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి-చిరంజీవి కలిసి నటించారు. 
 

67
RC 16 Launching

జగదేకవీరుడు అతిలోకసుందరి రీమేక్ లో రామ్ చరణ్ - జాన్వీ నటిస్తున్నారని పలు కథనాలు వెలువడ్డాయి. అవేమీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చరణ్, జాన్వీ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16 మూవీ చేస్తున్నారు. 
 

77
Chiranjeevi

చిరంజీవి ఇంకా మాట్లాడుతూ.. నేను చేసిన చిత్రాలు, పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. నాకు ఫ్రీడమ్ ఫైటర్ రోల్స్ చేయాలని ఉండేది. సైరా చేశాను. ఆ మూవీ వలన చాలా నష్టపోయాము. మనం కోరుకున్న పాత్రలు వాటంతటికి ఏవ్ రావాలి... అన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories