ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఇండియా సినిమా అంటే.. రాజమౌళి పుణ్యమా అని టాలీవుడ్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుతోంది. అంతలా జక్కన్న తెలుగు సినిమా స్వరూపాన్ని మార్చేశారు. ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్, నిఖిల్ లాంటి హీరోల చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.