ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పాలనుకున్నా.. `సార్‌`హీరోయిన్‌ షాక్‌.. `భీమ్లా నాయక్‌`పై కామెంట్‌

Published : Feb 13, 2023, 05:00 PM ISTUpdated : Feb 13, 2023, 09:50 PM IST

తాను ఒక్క సినిమా చేసి చిత్ర పరిశ్రమని వదిలేయాలనుకున్నానని, కానీ తాను అనుకున్నది ఒకటి, జరిగింది మరోటి అని పేర్కొంది సంయుక్త. తాజాగా ఆమె తన కెరీర్‌ గురించి, `సార్‌` మూవీ గురించి ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది.   

PREV
15
ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పాలనుకున్నా.. `సార్‌`హీరోయిన్‌ షాక్‌.. `భీమ్లా నాయక్‌`పై కామెంట్‌

సంయుక్త మీనన్‌ `బింబిసార` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పాత్ర  నిడివి తక్కువే అయినా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని ఇప్పుడు బిజీ హీరోయిన్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో సాయిధరమ్‌ తేజ్‌ `విరూపాక్ష`, ధనుష్‌ `సార్‌` మూవీస్‌ ఉన్నాయి. ఇందులో `సార్‌` ఈ నెల 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. 

25

తాను సినిమాలు వదిలేయాలనుకునే విషయాన్ని వెల్లడించింది. `కేరళలోని ఓ పల్లెటూళ్లో పుట్టిన నేను సినిమాల్లోకి వస్తానని హీరోయిన్ గా రాణిస్తానని అస్సలు ఊహించలేదు. తొలి సినిమాలో నటిస్తున్నప్పుడు ఏదో వెకేషన్ కు వెళ్లినట్టుగా ఫీలయ్యానని ఓ మంచి సినిమాలో నటించి ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా. అయితే నేనొకటి తలిస్తే విధి మరోటి తలిచిందని ఆ కారణంగానే నేను హీరోయిన్ గా ఇక్కడ వున్నా.  ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న నేను ఆ తరువాత సినిమాతో ప్రేమలో పడిపోయా` అని చెప్పింది. 
 

35

`నేను తెలుగులో మొదట` బింబిసార`, ఆ తరువాత `విరూపాక్ష` సినిమా అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలయ్యాక కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్ లో `భీమ్లా నాయక్ `లో నటించే అవకాశమొచ్చింది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో నేను పోషించిన పాత్రలో చేసిన మార్పులు నచ్చి, వెంటనే ఆ సినిమా అంగీకరించడం జరిగింది. `భీమ్లా నాయక్` షూటింగ్ సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే `సార్` చిత్రం. డైరెక్టర్ వెంకీ కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి.
 

45

కొన్ని పాత్రల కోసం ముందుగానే హోమ్ వర్క్ చేయాలి. కొన్ని కొన్ని పాత్రలు మాత్రం అప్పటికప్పుడు సహజంగా చేస్తేనే బాగుంటుంది. ఇందులో నేను తెలుగు పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అలాగే పాత్ర గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్టర్, రైటర్ తో ఎక్కువ చర్చించాను. అంతేకాకుండా టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ గమనించాను.
 

55

ధనుష్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చూస్తున్నాను. ఆయనకు అభిమానిని. ఆయన మంచి నటుడు, అలాగే పెద్ద స్టార్ కూడా. అలాంటి నటుడితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్ తోడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఆ హీరో అభిమానుల ప్రేమ కూడా దక్కుతుంది. `భీమ్లా నాయక్` సమయంలో పవన్ కళ్యాణ్  అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు. నెక్ట్స్ తెలుగులో `బింబిసార2`లో నటిస్తున్నట్టు చెప్పింది సంయుక్త. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories