ఈ క్రమంలో మనోజ్ అక్కగారైన మంచు లక్ష్మిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గుడిలో వ్యక్తిగత విషయాలు అడగడం కరెక్ట్ కాదన్నారు. ఇక మనోజ్ పెళ్లి సంగతి నాకు తెలియదన్నారు. నా పరిధిలో ఉన్న విషయాలు మాత్రమే నేను చెప్పగలను అన్నారు. మనోజ్ వివాహం నా పరిధిలో లేదని పరోక్షంగా వెల్లడించారు. ఆమె నటిస్తున్న చిత్రాలు, సామాజిక సేవా కార్యక్రమాలు వివరాలు కూడా పంచుకున్నారు.