తనకు మళ్లీ తల్లిని కావాలని ఉందని చెప్పింది. ప్రస్తుతం ఆమె వయసు నలభై ఏళ్లు. ఈ సమయంలో మళ్లీ తల్లి కావాలనుకోవడమే ఆశ్చర్యంగా మారింది. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉంది. తాను ఆడబిడ్డకి జన్మనివ్వాలని అనుకుంటుందట. తనకు అమ్మాయి కావాలట. ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ ఫీలింగ్ వేరే అని, ఆమె చేసే అల్లరి వేరేలా ఉంటుందని, లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు.
అమ్మాయి లేని జీవితమే వేస్ట్ అని చెప్పింది అనసూయ. ఇప్పుడు ఇద్దరు మగపిల్లలు, వాళ్ల భర్త సుశాంక్‌తో కలిసి ముగ్గురు అబ్బాయిలుంటారు. ముగ్గురు మీసాలు గడ్డాలతో ఉంటారు. కూతురు ఉంటే కంట్రోల్‌లో ఉంటారు. ఇళ్లు బ్యాలెన్స్ అవుతుందని, ఇళ్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల ఉండాలని చెప్పింది.