యాంకర్ సౌమ్య రావు `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ప్రారంభం వరకు ఆమె యాంకర్‌గా కొనసాగింది. తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ని రక్తికట్టించింది. కామెడీని పండించింది. కానీ ఉన్నట్టుంది షో నుంచి తప్పుకుంది. దీనితో అనేక రూమర్లు వచ్చాయి. హైపర్ ఆది కారణమనే కామెంట్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించింది సౌమ్య రావు.
Sowmya Rao
సౌమ్య రావు చాలా గ్యాప్ తర్వాత తన షో గురించి మాట్లాడింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ రాణించడం, జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేయడం, తప్పుకోవడానికి సంబంధించిన ఆమె వెల్లడించింది. తాను కన్నడ నటినే అని, కానీ తెలుగు వారు తనని ఎంతగానో ఎంకరేజ్ చేశారని తెలిపింది.
వారి వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందన్నారు. తనని జబర్దస్త్ షో నుంచి తీసేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆసమయంలో చాలా హర్ట్ అయినట్టు తెలిపింది. దీనికో కథ చెప్పింది.
ఒక వ్యక్తికి ఏమీ లేని స్థితిలో సైకిల్‌ని సంపాదించుకుని వెళ్తుంది, ఆ తర్వాత కష్టపడి ఓ చిన్నపాటి మారుతి కారు కొనుకుని వెళ్తుంది, ఇంతలో ఒకరు బెంజ్ కారులో వచ్చి, నువ్వు డ్రైవ్ చేయాల్సింది అది కాదు, బెంజ్ కారు డ్రైవ్ చేయమన్నారు.
బెంజ్ కారు అనేసరికి సంతోషంగా ఆ కారు ఎక్కితే కొంత దూరం వెళ్లాక మధ్యలోనే వదిలేశారు. దీంతో బెంజ్ కారు డ్రైవ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలా? లేక తనకు కారుకి దూరంగా వదిలేసినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని, సరిగ్గా తన పరిస్థితి కూడా అదే అని చెప్పింది సౌమ్య రావు.
అయితే తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి హైపర్ ఆది, బాడీ షేమింగ్ కామెంట్స్ అనే రూమర్లు ఉన్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది సౌమ్య. హైపర్ ఆది వల్ల కాదు అని స్పష్టం చేసింది. వారంతా ఎంతో ఎంకరేజ్ చేస్తారని, ఒకరిని తొక్కేయాలని ఎప్పుడూ చూడరు అని, వాళ్లు కూడా ఏం లేని స్థితి నుంచి వచ్చినవల్లే అలా చేయరు,
హైపర్ ఆది ఎంతో ఎంకరేజ్ చేశాడు, పంచ్‌లు వేసినా, సెటైర్లు పేల్చినా అది కామెడీ కోసమే అని, కామెడీ షో చేస్తున్నప్పుడు తనపై పంచ్‌లు వేసినా తీసుకోవాలి, తాను వేసేలా కూడా ఉండాలి, అప్పుడే వినోదం పండుతుందన్నారు సౌమ్య రావు. తనని జబర్దస్త్ నుంచి తప్పించడానికి ఆది కారణం కాదని తెలిపింది.
ఇదిలా ఉంటే తనపై బాడీ షేమింగ్ కామెంట్లకి రియాక్ట్ అయ్యింది. ఓ రోజు షో రోహిణి దిష్టిబొమ్మలా ఉందని కామెంట్ చేసిందని, అంతేకాదు తనపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యిందని, కాసేపు హీట్ మూమెంట్ నెలకొంది. ఆ క్షణంలో తాను ఫీలైనట్టు తెలిపింది సౌమ్యరావు. కాకపోతే అది జోక్ అని ఆ తర్వాత చెప్పడంలో కూల్ అయిపోయాను,
కానీ ముందు తనకు ఆ విషయం చెప్పలేదని, ఏంటీ ఇలా అంటున్నారని కాసేపు తనకు కూడా అర్థం లేదని తెలిపింది. దీంతో బాధ పడినా, వెంటనే తేరుకున్నానని చెప్పింది. ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో భాగమే అని తెలిపింది సౌమ్యరావు. కామెడీ షో చేస్తున్నప్పుడు ఇవన్నీ కామన్ అని, వాటిని తీసుకుంటేనే షోస్ చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలని తెలిపింది.
ఇక ఇప్పుడు కొత్తగా షోస్ చేయకపోవడం, సీరియల్స్ లోనూ కనిపించకపోవడంపై స్పందిస్తూ, ఎవరూ తనకు సరైన స్క్రిప్ట్ లు ఆఫర్ చేయడం లేదని తెలిపింది. ఇంకా సరైన ఎంకరేజ్‌మెంట్ రావడం లేదని అన్నారు. ఆ విషయంలో తనకు ఎంతో వెలితి ఉందని చెప్పింది. అయితే తన పాత్ర ఎలివేట్ అయ్యేలా, బలంగా ఉన్న వాటికే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది సౌమ్య రావు. కమ్ బ్యాక్ కోసం వెచి చూస్తున్నట్లు వెల్లడించింది సౌమ్య రావు.
ఆమె జబర్దస్త్ షోకి అనసూయ స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికిపైగానే చేసింది కానీ ఉన్నట్టుండి తొలగించారు. ఆ తర్వాత సిరి వచ్చింది. చివరకు ఒక షో మొత్తం ఎత్తేసి ఒక్క షో జబర్దస్ ని మాత్రమే నడిపిస్తున్నారు. అయితే సౌమ్య రావుని తప్పించడానికి ఆమె అంతగా ఆకట్టుకోలేకపోవడమే కారణమని, రేటింగ్ రాకపోవడమే కారణమని తెలుస్తుంది.
read more: `విడుదల 2` మూవీ రివ్యూ, రేటింగ్.. విజయ్ సేతుపతి విశ్వరూపం చూపించాడా?
also read: `బచ్చల మల్లి` మూవీ రివ్యూ, రేటింగ్.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్ పడిందా?