బాలయ్యతో ఫ్యాక్షన్ సినిమా చేస్తా, ఫ్యాన్స్ అర్దం చేసుకోవాలంటూ చిరు

First Published | Sep 2, 2024, 7:36 AM IST

 చిరంజీవి ఇచ్చిన స్పీచ్ అంతటా వైరల్ గా మారింది.  బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations, chiranjeevi


నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ లో యావత్ తెలుగు సిని ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులు సందడి చేసారు. తమ అభిమాన హీరోలంతా ఒకే చోట కనపడటం చూసి ఫ్యాన్స్ పులకించిపోయారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇచ్చిన స్పీచ్ అంతటా వైరల్ గా మారింది.  బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations



చిరంజీవి మాట్లాడుతూ... తాను ‘ఇంద్ర’ మూవీ చేయడానికి బాలకృష్ణ (Balakrishna) ‘సమరసింహారెడ్డి’ ఆదర్శమని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్‌ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు.  
 


Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations



చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ బాలయ్యబాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్‌కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు’’

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations



అలాగే ‘‘ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. 
 

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations



భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేమంతా ఒక కుటుంబంలాంటి వాళ్లం, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations

 
 స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) తనయుడిగా సినీ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టిన బాలయ్య అతి కొద్దీ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు.

Nandamuri balakrishna, NBK 50 Years, Celebrations


 సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో 1974లో రిలీజైన తాతమ్మ కల (Tatamma kala) అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు తెరకు నందమూరి బాలయ్య పరిచయమయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. గత కొన్నేళ్ళ నుంచి టాలీవుడ్ బడా హీరోగా కొనసాగుతున్న ఆయన నేటికీ యంగ్ హీరోలతో పోటి పడుతూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. 

Latest Videos

click me!