పృథ్వీరాజ్ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా..తెలుగులో సత్తా చాటుతున్న కన్నడ నటుడు 

First Published | Sep 2, 2024, 12:39 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈసారి బిగ్ బాస్ లో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. కన్నడ నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఈసారి బిగ్ బాస్ లో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. కన్నడ నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటుల్లో పృథ్వీరాజ్ శెట్టి ఒకరు. 

Prithvi raj Bigg Boss8

తెలుగులో పృథ్వీరాజ్ శెట్టి పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు. అందులో దొరసాని , మావారు మాస్టారు లాంటి సీరియల్స్ ఉన్నాయి. అదే విధంగా పృథ్వీరాజ్ నాగపంచమి సీరియల్ లో కూడా నటించారు. 


పృథ్వీరాజ్ కి చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే పృథ్వీరాజ్ మోడలింగ్ ని వృత్తిగా ఎంచుకున్నారు. మోడలింగ్ చేస్తుండగా కన్నడలో అర్థాంగి అనే సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. పృథ్వీరాజ్ నటించిన తొలి సీరియల్ అదే. 

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ కి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడడానికి కాస్త టైం పట్టిందట. నెమ్మదిగా తెలుగు కూడా పర్వాలేదనిపించే విధంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు పృథ్వీ రాజ్ కి వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ తో ఇంకెంత క్రేజ్ సాధిస్తాడో చూడాలి.  

Latest Videos

click me!