కల్పన ఫాదర్, బాల సుబ్రహ్మణ్యం ఒకే కాలేజీలో చదువుకున్నారట. అలా వారికి పరిచయం ఉండగా కల్పన తండ్రి ఏర్పాటు చేసిన మ్యూజిక్ బ్యాండ్ లో బాలుగారు పాటలు పాడేవారట. చిన్నప్పటి నుండి బాలుగారితో కల్పనకు అనుబంధం ఉందట.
ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేయడం చాలా కష్టం అని కల్పన అన్నారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నవ్వడం, ఏడవడం, గట్టిగా అరవడం చేయాలి. అందుకే డబ్బింగ్ ప్రొఫెషన్ వదిలివేశానని కల్పన తెలియజేశారు.
ఇక తాను తెలుగులో పదుల సంఖ్యలో పాటలు పాడగా, వెంకీ చిత్రంలోని గోంగూర తోటకాడ కాపు కాశా.. అలాగే అంజి చిత్రంలోని అమ్మో నీ యమ్మ గొప్పదే.. సాంగ్స్ తనకు ఇష్టం అని అన్నారు. లైవ్ సింగింగ్ మరింత ఇష్టపడతానని కల్పన తెలిపారు.
2010లో కల్పన గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నారట. ఉన్నది మొత్తం కోల్పోవడంతో మానసిక వేదనకు గురయ్యారట. ఆ సమయంలోనే చనిపోదాం అని కల్పన కఠిన నిర్ణయం తీసుకున్నారట.
అప్పుడు సింగర్ చిత్ర ఆమెకు మద్దతుగా నిలిచారట. మలయాళంలో ఓ షో నడుస్తుంది పార్టిసిపేట్ చేస్తావా అన్నారట. ఆ షోలో ఎలాగైనా గెలవాలని పాల్గొన్న తాను టైటిల్ గెలిచినట్లు కల్పన తెలియజేశారు.
అయితే అప్పటికే ప్లే బ్యాక్ సింగర్ గా ఉండి , పోటీలలో కాంటెస్ట్ చేయడం ఏమిటని చాలా మంది విమర్శించారట. నీ వల్ల పరిశ్రమ పరువు పోతుందని కల్పనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆమె తెలియజేశారు.
ఇక త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్న కల్పన ఓ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారట. అలాగే మ్యూజిక్ లో పిహెచ్ డి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా 2017లో ప్రసారమైన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో కల్పన పాల్గొనడం జరిగింది. అయితే కల్పన అక్కడ పరిస్థితులకు అడ్జస్ట్ కాలేక నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యారు.