జనసేన కోసం మొత్తం డబ్బులు వాడేశాను,తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు... షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్ 

Published : May 24, 2024, 11:54 AM IST

పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన షకలక శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జనసేన పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చు చేయగా భార్య అలిగి మాట్లాడలేదట. నువ్వు ఇంత చేస్తే తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చేశాడని మామయ్య అడిగారట.   

PREV
15
జనసేన కోసం మొత్తం డబ్బులు వాడేశాను,తిరిగి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు... షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్ 
Shakalaka Shankar

పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ లో షకలక శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైన కామెంట్స్ చేస్తే ఆయన ఒప్పుకోరు. తరచుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా షకలక శంకర్ సినిమా కూడా చేశాడు. కాగా 2019ఎన్నికల్లో సొంత ఖర్చులతో జనసేన తరపున ప్రచారం చేశానని వెల్లడించాడు. 

25
shakalaka shankar

తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 2019లో జనసేన పార్టీ తరపున సొంత డబ్బుతో ప్రచారం చేశాను. రూ. 3 లక్షలతో భోజనాలు పెట్టించాను. నేను ఎక్కడికి వెళ్లినా కుర్రాళ్ళు దీనంగా చూసేవారు. వాళ్ళను అలా చూస్తుంటే నాకు ఊరికోబుద్ది కాదు. చేతిలో ఉన్న డబ్బంతా ఆవిరి అయిపోయింది. 

 

35

అడ్వాన్సుసులు వచ్చాయి అని ఇంట్లో వాళ్లతో చెప్పాను. వాళ్ళు నేను డబ్బులు తీసుకొస్తున్నాని అనుకున్నారు. తీరా చేతిలో చిల్లిగవ్వ లేదు. మా ఫ్రెండ్ తో వెయ్యి రూపాయల డీజిల్ కొట్టించుకొని ఇంటికి వచ్చాను. డబ్బులు ఖర్చు చేశానని మా ఆవిడ నాలుగు రోజులు మాట్లాడలేదు. మా మామయ్య కూడా బాధపడ్డారు. 

45

పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఇంత చేశావు... ఆయన కనీసం నీకు ఫోన్ చేశాడా? తిరిగి నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని అడిగాడు. అవును నిజమే కదా అనిపించింది. నేను ఎక్కడో శ్రీకాకుళంలో చేస్తే ఆయనకు తెలుస్తుందా? అనుకున్నాను. ఒకవేళ తెలిసి కూడా ఉండొచ్చని భావించాను. 
 

55

నేను పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఇదంతా చేశాను. తిరిగి ఏమీ ఆశించలేదు. కనీసం మూవీ చేసేటప్పుడు వాళ్లతో ఒక్క ఫోటో కూడా నేను ఆశించలేదు. 2024లో కూడా సేమ్. వారం రోజులు ప్రచారం చేశాను. కానీ ఈసారి నా దగ్గర డబ్బులు లేవని ముందే చెప్పాను. డీజిల్, ఫుడ్, బెడ్ మొత్తం వాళ్లే చూసుకున్నారు. నేను ప్రచారం చేశాను. నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. నేను అడగలేదు... అని షకలక శంకర్ చెప్పుకొచ్చాడు. ఈసారి ఎన్నికలకు మాత్రం వారే అన్ని ఖర్చులు చూసుకున్నారని షకలక శంకర్ వెల్లడించారు. 

Read more Photos on
click me!

Recommended Stories