ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేశాను.. కాకరేపుతున్న కీర్తి సురేష్ కామెంట్స్!

First Published | Aug 13, 2024, 10:52 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో కీర్తి సురేష్ కి ఆఫర్ వచ్చిందట. ఆమె నిర్మొహమాటంగా చేయను అని చెప్పిందట. ఈ మేరకు కీర్తి సురేష్ లేటెస్ట్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. 
 

హీరోయిన్ కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ ' రఘు తాత '. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్స్ కి చిన్న గ్యాప్ ఇచ్చి ' రఘు తాత' చిత్రాన్ని  ప్రమోట్ చేసే పనిలో పడింది కీర్తి సురేష్.  పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ మూవీలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశానని చెప్పి కీర్తి సురేష్ ఒకింత షాక్ ఇచ్చింది. 

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో  కీర్తి సురేష్ తీరిక లేకుండా గడుపుతుంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది.  తెలుగు,తమిళ మలయాళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.  ఈ ఏడాది కీర్తి సురేష్  బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. హిందీ లో ' బేబీ జాన్ ' సినిమాలో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ' తేరి ' కి ఇది అధికారిక రీమేక్. 


Actress Keerthy Suresh

అలాగే తెలుగులో సుహాస్ కి జంటగా ' ఉప్పు కప్పు రంబు ' సినిమా చేస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ .. కల్కి 2898 ఏడీ మూవీలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాకు కాల్ చేశారు. కానీ ఆ పాత్ర నేను చేయలేను అని సున్నితంగా తిరస్కరించాను.  ఆ తర్వాత ఈ ప్రాజెక్టు లో భాగం కావాలని ఉంది అని నాగ్ అశ్విన్ కి మెసేజ్ చేశాను. 
 

అప్పుడు ఆయన కాల్ చేసి బుజ్జి రోల్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు.   షూట్ లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా అని అడిగాను. లేదు కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. వెంటనే ఒకే చెప్పా. బుజ్జి కి డబ్బింగ్ ఇచ్చే విషయంలో నాగ్ అశ్విన్ నాకు చాలా హెల్ప్ చేశారు. కల్కి పార్ట్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని కీర్తి సురేష్ తెలిపారు. 

ఇక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన  ' రఘు తాత ' చిత్రాన్ని సుమన్ కుమార్ డైరెక్ట్ చేశారు. కేజిఎఫ్, కాంతారా, సలార్ వంటి  సినిమాలు ప్రొడ్యూస్ చేసిన బడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ' రఘు తాత ' రూపొందించబడింది. ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజీవ్ రవీంద్రన్, జయకుమార్, ఆనంద్ సామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని  నిర్మించారు.  సియన్ రోల్డన్ మ్యూజిక్ అందించారు. 

Latest Videos

click me!