అసలు నటనకు పనికొచ్చే ఫేసేనా ఇది... రష్మికను ఏడిపించేశారు, ఏకంగా 25 సార్లు!

First Published | Aug 13, 2024, 9:45 AM IST

రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. కానీ ఆమెకు కూడా అవమానాలు తప్పలేదు. నటించే ముఖమేనా ఇది అని అవమానించారట. ఏడ్చుకుంటూ ఆమె ఇంటికి వెళ్లిందట. 
 

హీరోయిన్ రష్మిక మందాన కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ మూవీ సూపర్ హిట్. ఆ మూవీలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నిశ్చితార్థం కూడా అయ్యాక తన నిర్ణయం మార్చుకుంది. ఈ విషయంలో రక్షిత్ ఫ్యాన్స్ నుండి ఆమె విమర్శలు ఎదుర్కొంది. 

తెలుగులో రష్మిక మొదటి చిత్రం ఛలో. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. ఛలో విజయం అందుకుంది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. అంచెలంచెలుగా ఎదిగింది. టాలీవుడ్ సినిమాలతో స్టార్ డమ్  తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్ పై కూడా కన్నేసింది. 


గత ఏడాది ఆమె రన్బీర్ కపూర్ కి జంటగా నటించిన యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. హిందీలో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రష్మిక ఈ చిత్రంలో ఒకింత బోల్డ్ రోల్ చేసింది. 

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్ రష్మిక మందాన. అయితే కెరీర్ బిగినింగ్ లో ఆమెకు అనేక అవమానాలు ఎదురయ్యాయట. తాజాగా ఓ ఈవెంట్లో రష్మిక పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎదురైన అనుభవాలు తలచుకుంది. అసలు ఇది నటనకు పనికొచ్చే ముఖమేనా అన్నట్లు చూశారట. 

రష్మిక మాట్లాడుతూ... ఆడిషన్స్ లో రిజెక్ట్ చేసిన ప్రతిసారి ఏడుస్తూ ఇంటికి వచ్చేదాన్ని. ఓ సినిమా కోసం పదే పదే ఆడిషన్స్ చేశారు. చివరికి ఎంపిక చేశారు. ఆ సినిమా కోసం రెండు మూడు నెలలు వర్క్ షాప్స్ లో పాల్గొన్నాను. అనుకోకుండా ఆ సినిమా రద్దు అయ్యింది. ఆ తర్వాత 25 ఆడిషన్స్ లో నన్ను తిరస్కరించారు. వాళ్లకు నా నటన మీద విశ్వాసం ఉండేది కాదు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నేను చేసిన ప్రతి సినిమాలో ఇంకా బాగా నటిస్తే బాగుండేది అనుకుంటున్నాను, అన్నారు. 
 

Latest Videos

click me!