Ghudchadi
కొన్ని కాంబినేషన్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాంటివాటిల్లో ఒకటి సంజయ్ దత్, రవీనా టాండన్. అయితే ఈ కాలానికి ఈ కాంబో అంటే కాస్త కష్టమే అనిపిస్తుంది. అయితే నార్త్ లో వాళ్ల పెయిర్ కు ఉన్న క్రేజ్ కొద్దో గొప్పో క్రేజ్ ఉన్నట్లుంది. దాంతో ధైర్యం చేసారు. అలాగే మన తెలుగు వాళ్లకు ఈ మధ్యన సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తున్నాడు. దాంతో ఇక్కడా క్రేజ్ ఉంది. అయితే క్రేజ్ ఉన్నా, మరొకటి ఉన్నా కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే సున్నానే. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది... కథేంటి , మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా?
కథేంటి
సినిమా ప్రారంభం మూడు జనరేషన్స్ కళ్యాణి నివాస్ అనే బిల్డింగ్ లో ఉన్నారనే పరిచయంతో మొదలవుతుంది. అంటే మూడు జనరేషన్స్ సమస్యలను చెప్పబోతున్నారని హింట్ ఇస్తారు. వీర్ శర్మ (సంజయ్ దత్) రిటైర్డ్ కర్నల్. అతను తల్లి కళ్యాణీ దేవి(అరుణ ఇరానీ) . ఆమె అంటే విపరీతమైన ఇష్టం. అలాగే తన కొడుకు చిరాగ్ (పార్థ్ సమ్తాన్). అతనూ తండ్రి చెప్పిన మాట జవదాటడు. దాంతో తల్లి, కొడుకుతో హ్యాపీగా ఉంటూంటాడు. ఇక చిరాక్ ఓ మంచి కొడుకుగా తన తండ్రి దగ్గర నమ్రతగా ఉంటూంటాడు. కొడుకు చిరాక్ కో లవర్ దేవికా (ఖుశాలీ కుమార్) . అయితే ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పరిచయం చేద్దామంటే ఆమె కులం వేరు. తమ కులం వేరు. దాంతో సైలెంట్ గా ఉంటూ టైమ్ కోసం ఎదురుచూస్తూంటాడు.
Ghudchadi
ఇదిలా ఉంటే వీర్ శర్మ ఓ రోజు అనుకోకుండా తన మాజీ ప్రేయసి మేనక (రవీనా టాండన్) ని కలుస్తాడు. ఆమె ని చూడగానే గతం గుర్తుకు వస్తుంది. ఆమెది తమది ఒకే కులం కాకపోవటంతో తను వేరే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆమె కూడా వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమెకు భర్త చనిపోయాడు. తన భార్యా చనిపోయింది. ఇద్దరు ఒంటిరిగా ఉంటున్నామని తెలుసుకుంటాడు. ఆమె దగ్గర పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ఆమె కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అయితే ఆమెకో కూతురు ఉంది. అతనికో కొడుకు ఉన్నాడని చెప్పుకుంటారు. అయినా ఓకే చేసుకుని వీర్ శర్మ తన తల్లి దగ్గర ప్రపోజ్ పెడదామనుకుంటాడు.
Ghudchadi
అయితే ఇక్కడే ఓ మెలిక ఉంటుంది. అదేమింటే...వీర్ శర్మ కొడుకు చిరాక్ ప్రేమించేది మరెవరినో కాదు తన తండ్రి మాజీ ప్రేయసి త్వరలో తన పిన్ని కాబోతున్న మేనక కుమార్తెని. ఆ విషయం తెలిసి ఇద్దరూ షాక్ అవుతారు. ఈ కొత్త ట్విస్ట్ వారి జీవితాలను అతలాకుతలం చేసేస్తుంది. తన చెల్లి వరస అయ్యే ఆమెను మర్చిపోవాలా లేక తన తల్లి, తండ్రులు పెళ్లి చేసుకోకుండా ఆపి తమ ప్రేమను సక్సెస్ చేసుకోవాలా అనే డైలమోలో పడిపోతారు. అప్పుడు ఏమైంది. ఈ విషయం తెలిసిన ఆ తల్లి తండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నారు. చివరకు కథ ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Ghudchadi
విశ్లేషణ
ఇదో రొమాంటిక్ కామెడీ అని డైరక్టర్ ఫిక్స్ అయ్యి తీనట్లున్నాడు. అయితే కామెడీ ఏమిటంటే ఇందులో ఫన్ లేదు..రొమాన్స్ అంతకన్నా లేదు. కొద్దిగా పాతకాలం నాటి డ్రామా ఉంది. ఫస్ట్ యాక్ట్ నుంచి ప్రధాన పాత్రలు గొడవలు, అలకలూ, ప్రేమకథలూ చూపించడానికి దర్శకుడు చాలా సమయం తీసుకొన్నాడు. ఓరకంగా చెప్పాలంటే ఇంట్రవెల్ దాకా కూడా అసలు కథలోకి వెళ్లదు. ఇంట్రవెల్ కార్డ్ దగ్గర అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకొన్నాడు? ఈ కథ ఎంత వరకూ అయ్యింది? అంటే ఆన్సర్ దొరకదు.
Ghudchadi
సెకండాఫ్‌లో పిల్లల ప్రేమకు అడ్డుపడే తల్లి,తండ్రుల ప్రేమలు అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. అసలు ఎలాంటి సమస్యలో ప్రధాన పాత్రలు ఇరుక్కొన్నారు? అనే ప్రశ్న చుట్టూనే కథ తిరుగుతుంది. అంతేతప్ప పరిష్కార దిసగా నడవదు. దాంతో ఎందుకు పనిగట్టుకుని ఈ సీన్స్ సాగదీస్తున్నారు? అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ దాకా ఇదే వరస. క్లైమాక్స్ లో ప్రతీ ఒక్కరూ ఊహించే ముగింపే. ఎమోషన్ తో ముడిపడిన పాయింట్ అది. కానీ అది ఎక్సప్లోర్ అవ్వలేదు. సమస్య ,పరిష్కారం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. ఎవరూ ఏదీ సీరియస్ గా తీసుకోరు. ఆయా సన్నివేశాల్ని చుట్టేసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అన్నేళ్లుగా కుటుంబంలో నలుగుతున్న విషయాన్ని చివరి పది, పన్నెండు నిమిషాల్లో ముగించారు. ఆ డ్రామాని కొత్తగా ఆవిష్కరిస్తే, బిగువైన స్క్రీన్ ప్లేతో సన్నివేశాల్ని రాసుకోగలిగితే.. ఒడ్డునపడేదేమో? తొలి సగంలో సాగదీత ప్రేక్షకుల్నిచివరిదాకా విసిగించటమే ఈ సినిమా ప్రత్యేకత.
Ghudchadi
నటీనటుల్లో ...
సంజయ్ దత్ మంచి నటుడు. పాత్రకు ఏం కావాలో అదే చేస్తాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ పాత్రకు తను పర్‌ఫెక్ట్ గా సరిపోయాడు. రవీనా టాండన్ ఎమోషనల్ సీన్స్లో నటిగా తనేంటో చెబుతుంది. మిగిలిన పాత్రలు ఏమాత్రం ఇంప్రెస్ చేయవు. టెక్నికల్‌గా ఈ సినిమా బాగానే ఫరవాలేదు. పాటలు గుర్తు పెట్టుకొనేలా లేవు. కానీ నేపథ్య సంగీతంతో ఓ మూడ్ క్రియేట్ చేశాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. నార్త్ లొకేషన్స్ మాత్రం అందంగా చూపించారు. మాటలు కొన్ని బాగానే పేలాయి. అయితే ఇంకాస్త ఇంపాక్ట్ చూపించాల్సింది.
Ghudchadi
చూడచ్చా
రొమాంటిక్ కామెడీ అని ఆవేశపడతే నీరసం వస్తుంది. ఇదో స్టీరియో టిపుకల్ ఫ్యామిలీ డ్రామా. కొత్తదనం లేని ఈ వెబ్ మూవి ని కాస్తంత ఓపిగ్గానే భరించాలి.
ఎక్కడుంది
జియో సినిమా ఓటిటి లో తెలుగులో ఉంది