సినిమాల్లో చూపించినట్లే ఐటి రైడ్స్ జరుగుతాయా ?..3 రోజుల పాటు మాపై, బాహుబలి నిర్మాత సంచలన వ్యాఖ్యలు

First Published | Oct 28, 2024, 12:25 PM IST

రియల్ లైఫ్ లో ఐటి రైడ్స్ ఎలా జరుగుతాయి అనేదానిపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. టాలీవుడ్ లో నిర్మాతలపై తరచుగా ఐటి రైడ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో బాహుబలి చిత్ర నిర్మాతలపై భారీ స్థాయిలో ఐటి రైడ్ జరిగింది.

ఐటి రైడ్స్ గురించి అందరం వింటూనే ఉంటాం. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకి అనుమానం వచ్చిన వ్యక్తుల ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేసి ఆదాయపు పన్ను వివరాలు పరిశీలిస్తారు. తేడాలు ఉంటే కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, ఆస్తులు సీజ్ చేయడం లాంటివి ఉంటాయి. అయితే ఐటి అధికారుల సోదాలని ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం. 

రియల్ లైఫ్ లో ఐటి రైడ్స్ ఎలా జరుగుతాయి అనేదానిపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. టాలీవుడ్ లో నిర్మాతలపై తరచుగా ఐటి రైడ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో బాహుబలి చిత్ర నిర్మాతలపై భారీ స్థాయిలో ఐటి రైడ్ జరిగింది. బాహుబలి చిత్రం వేలకోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దీనితో లావాదేవీల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అనుమానాలు రావడం సహజం. 

Latest Videos


తమపై ఐటి అధికారులు రైడ్ చేయడంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆరోజు ఏం జరిగింది, అధికారులు ఎలా రైడ్ చేశారో శోభు పూసగుచ్చినట్లు వివరించారు. నిజంగానే సినిమాల్లో చూయించినట్లే ఐటి అధికారుల రైడ్స్ ఉంటాయా అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. అవును దాదాపుగా అలాగే ఉంటాయి.. వాళ్ళు రాగానే కమ్యూనికేషన్ కట్ చేయడం కోసం మొబైల్స్ తీసేసుకుంటారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలి అని ఆదేశిస్తారు. 

ఆ తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అకౌంట్స్ అన్నీ పరిశీలిస్తారు. బిగినింగ్ లో చాలా రూడ్ గా మాట్లాడతారు. లెక్కలు పరిశీలించిన తర్వాత తేడాలు ఏమిలేవని తెలిస్తే అప్పుడు మర్యాదపూర్వకంగా నార్మల్ గా మాట్లాడతారు అని శోభు తెలిపారు. మాపై మూడు రోజుల పాటు అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు వచ్చేముందు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా అని అడగగా.. అలా ఏమి ఉండదు.. వాళ్ళు సడెన్ గానే వస్తారు అని తెలిపారు. 

కావాలని టార్గెట్ చేసి ఐటి రైడ్స్ చేస్తారా అని యాంకర్ అడగగా.. అలా అని నేను అనుకోవడం లేదు. వాళ్ళకి సిస్టమ్ అనాలిసిస్ డేటా ఉంటుంది. భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిగితే సిస్టం డేటా అలెర్ట్ చేస్తుంది. ఆ విధంగా రైడ్స్ చేస్తారు. వాళ్లకున్న సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినా రైడ్స్ చేస్తారు. బయటి వ్యక్తులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమని వాళ్ళు నమ్మితే అప్పుడు కూడా రైడ్స్ చేస్తారు. రైడ్స్ చేసినప్పుడు అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజం అయితే.. అతడికి రివార్డ్ కూడా ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ విధంగా పనిచేస్తారు అని శోభు తెలిపారు.

click me!