వాడి వేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారట. నయని పావని, గౌతమ్, యష్మి, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారట. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. కాగా యష్మి ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఆమె ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉంది. గేమ్ పరంగా మెప్పిస్తుంది. యష్మికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
యష్మిని మినహాయిస్తే మిగతా నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వీరిలోనే ఒకరు ఎలిమినేట్ అవుతారు అనడంలో సందేహం లేదు. టేస్టీ తేజకు ఎంటర్టైనర్ గా పేరుంది. సీజన్ 7లో టేస్టీ తేజ 9 వారాలు హౌస్లో ఉన్నాడు. ప్రేక్షకులు అతడికి ఓట్లు వేస్తారు. హరి తేజ సైతం స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె ఈ వారం ఎలిమినేట్ కాకపోవచ్చు. సీజన్ 1లో హరితేజ టాప్ 3లో నిలిచింది.