Unstoppable With Prabhas: రొమాన్స్ జరగలేదు, అందుకే పెళ్లి కాలేదు!

Published : Dec 30, 2022, 02:42 PM IST

ఆఫ్ స్క్రీన్లో ఎవరితో రొమాన్స్ చేయలేదని ప్రభాస్ మొత్తుకున్నాడు. బాలయ్య మాత్రం ఏదో విధంగా నిజం రాబట్టే ప్రయత్నం చేశారు. అదే జరిగితే ఎప్పుడో పెళ్ళైపోయేదని ప్రభాస్ ఆసక్తికర సమాధానం చెప్పారు.   

PREV
16
Unstoppable With Prabhas: రొమాన్స్ జరగలేదు, అందుకే పెళ్లి కాలేదు!
Unstoppable With Prabhas

ప్రభాస్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షోకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అసలు ఇంటర్వ్యూలు అంటేనే ఇష్టపడని ప్రభాస్ బోల్డ్ టాక్ షోకి రావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇక ప్రోమోలు మరింత ఆసక్తి పెంచేశాయి. దాంతో జనాలు ప్రభాస్-బాలయ్యల ఎపిసోడ్ కోసం ఎగబడ్డారు. 
 

26
Unstoppable With Prabhas


దాదాపు పది లక్షల మంది ఆహా యాప్ లో ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం లాగిన్ అయ్యారనేది ఓ అంచనా. ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ పోటెత్తడంతో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. సేవలు నిలిచిపోయాయి. సేవలు పునరుద్ధరించేందుకు గంటల సమయం పట్టింది. 
 

36
Unstoppable With Prabhas


ఇక షోలో బాలయ్య-ప్రభాస్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముఖ్యంగా ప్రభాస్ వ్యక్తిగత విషయాలపై బాలయ్య దృష్టి పెట్టారు. ప్రేమ,పెళ్లి వంటి విషయాల్లో స్పష్టత రాబట్టాలని ట్రై చేశారు. ప్రభాస్ మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. 
 

46
Unstoppable With Prabhas


ప్రభాస్ ఓ నంబర్ కోరుకోవాల్సి ఉంది. కోరుకున్న నంబర్ ఉన్న కార్డులో రాసి ఉన్న ప్రశ్న బాలయ్య గెస్ట్ ప్రభాస్ ని అడుగుతారు. ఈ గేమ్ లో ప్రభాస్ చెప్పిన నంబర్ ఉన్న కార్డులో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ ఎవరితో చేసావని రాసి ఉంది. సినిమాల్లో కాకుండా బయట ఎవరితో రొమాన్స్ చేసావని బాలయ్య అడిగారు. 
 

56
Unstoppable With Prabhas


నేను రొమాన్స్ ఎవరితోనూ చేయలేదు. అలా చేస్తే పెళ్ళైపోయేదని ప్రభాస్ అన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే రొమాన్స్ చేసి ఉంటావు. ఎవరితో చేసావో చెప్పు అని బాలయ్య గట్టిగా అడిగారు. ఎంత అడిగినా ప్రభాస్ నోరు మెదపలేదు. ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని బాలకృష్ణ లైట్ తీసుకున్నాడు.   

66
Unstoppable With Prabhas


అయితే ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని ఓ సీక్రెట్ లీక్ చేశాడు. అమ్మాయి సనన్ నా? లేక శెట్టినా? అని బాలకృష్ణ మంట రగిలించారు. దీన్ని కూడా ప్రభాస్ ఒప్పుకోలేదు. చరణ్ నన్ను ఇరికిస్తున్నాడు తప్పితే నేను ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదన్నారు. కాసేపటికి చరణ్ కూడా అంతా తూచ్ అని కాడి పడేశాడు. దీంతో ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడని క్లారిటీ వచ్చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories