నటుడు విజయ్ వర్మతో తమన్నా (Tamannah Bhatia) డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇద్దరూ మాల్దీవ్స్ వెళ్లి వచ్చారని సమాచారం. విజయ్ వర్మతో రిలేషన్ ఎంజాయ్ చేస్తున్న తమన్నా పెళ్లి విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయం వెల్లడిస్తుంది. తనకు ఆ ఉద్దేశం లేదంటుంది.
27
తమన్నా తన రిలేషన్ స్టేటస్ పై ఓపెన్ అయ్యింది. పుకార్లను ధృవీకరిస్తూ... అవును విజయ్ వర్మను ఇష్టపడుతున్నాను. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో మా మధ్య ప్రేమ చిగురించింది. అతడు అన్ని విధాలా నాకు రక్షణగా ఉంటాడనే నమ్మకం కుదిరింది. అందుకే ఇష్టపడ్డాను, అన్నారు. ఈ క్రమంలో విజయ్ వర్మను తమన్నా త్వరలో వివాహం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
37
అయితే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తమన్నా షాక్ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో మీ వివాహం ఎప్పుడని అడగ్గా... నాకు వివాహ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకప్పుడు వివాహం చేసుకోవాలనుకున్నాను. ప్రస్తుతం నా మానసిక స్థితి వేరు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలి. షూటింగ్స్ సెట్స్ నేను ఇష్టపడే ప్రదేశం. నటన మీదే నా దృష్టి, అని అన్నారు.
47
పెళ్లి ఆలోచన లేదన్న విజయ్ వర్మ(Vijay Varmanu)ను ఎందుకు ప్రేమిస్తుందనే సందేహాలు మొదలయ్యాయి. బహుశా దీని గురించి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగి ఉండవచ్చు. పెళ్లి అనే బంధంలో అడుగుపెట్టకుండా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని ఉండొచ్చు. ఇక బాలీవుడ్ లో సహజీవనం కల్చర్ ఎక్కువైపోగా తమన్నా-విజయ్ వర్మ తీరు అలానే ఉంది.
57
ఇక విరామం దొరికితే వీరిద్దరూ విహారాలకు చెక్కేస్తున్నారు. తాజాగా మాల్దీవ్స్ వెళ్లారని సమాచారం. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించారు. మొదట తమన్నా నడుచుకుంటూ వచ్చింది. ఆమెను విజయ్ వర్మ ఎక్కడని మీడియా ప్రశ్నించింది. ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అనంతరం విజయ్ వర్మ వచ్చాడు. ఆయన్ని ఒకరు 'మాల్దీవ్స్ లో బాగా ఎంజాయ్ చేశారా? అని అడిగారు. ఆ ఇబ్బందికర ప్రశ్నకు విజయ్ వర్మ అసహనం ఫీల్ అయ్యాడు. ఇలా మాట్లాడటం సరికాదని విజయ్ అన్నారు.
67
Image: Instagram
మరోవైపు జైలర్(Jailer) మూవీతో తమన్నా భారీ హిట్ కొట్టింది. కెరీర్లో మొదటిసారి రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది తమన్నా. ఈ మూవీ రూ. 650 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అయితే జైలర్ లో తామన్నప్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. చిరంజీవితో చేసిన భోళా శంకర్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.
77
Tamannaah Bhatia, Vijay Varma
ప్రస్తుతం తమన్నా తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రం చొప్పున చేస్తుంది. ఆమె తెలుగులో ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు. చెప్పాలంటే తమన్నా కెరీర్ నెమ్మదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.