నేను సింగిల్ కాదు... బాంబు పేల్చిన కీర్తి సురేష్, ఎవరా లక్కీ ఫెలో?

First Published | Aug 9, 2024, 9:57 PM IST


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కీలక కామెంట్స్ చేసింది. తాను సింగిల్ కాదని ఓపెన్ గా చెప్పింది. మరి కీర్తి సురేష్ మనసు దోచిన ఆ లక్కీ ఫెలో ఎవరో చూద్దాం.. 
 

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కీర్తి మొదటి చిత్రం నేను లోకల్. నాని హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అనూహ్యంగా అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ మూవీ పరాజయం కావడంతో నిరాశకు గురైంది. 

మహానటి కీర్తి సురేష్ ఇమేజ్ మార్చేసింది. ఆ చిత్రం భారీ విజయం అందుకుంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. కాగా కీర్తి సురేష్ పై తరచుగా ఎఫైర్, మ్యారేజ్ రూమర్స్ వస్తుంటాయి. ఈ పుకార్లపై కీర్తి సురేష్ తాజాగా స్పందించారు. 


కీర్తి సురేష్ మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో నాకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో నన్ను బాగా ట్రోల్ చేశారు. సదరు ట్రోల్స్ బాధకు గురి చేశాయి. మహానటి విజయం తర్వాత ట్రోల్స్  తగ్గాయి. కొందరు కావాలనే నాపై పుకార్లు పుట్టించారు. నెగిటివిటీని నేను పట్టించుకోను. కాలమే వాటికి సమాధానం చెబుతుందని, ఆమె అన్నారు. 

కాగా ఓ విలేకరు మీరు సింగిల్ కదా, లైఫ్ బోర్ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా.... నేను సింగిల్ అని ఎవరు చెప్పారని కీర్తి సురేష్ షాకింగ్ ఆన్సర్ చెప్పింది. ఈ సందర్భంగా పెళ్లి అంటే కూడా ఏమిటో వివరించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనే వివాహం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. 

కీర్తి సురేష్ కేరళకు చెందిన ఓ రిసార్ట్ ఓనర్ ని ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకుంటుందని పుకార్లు లేచాయి. ఓ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా ఆమె ఎఫైర్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి వార్తలను ఖండించారు. తాజాగా నేను సింగిల్ కాదని చెప్పి ఆమె బాంబు పేల్చింది. మరి కీర్తి సురేష్ మనసు దోచిన ఆ లక్కీ ఫెలో ఎవరంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 
 

Latest Videos

click me!