
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `ఖుషి` మూవీ అప్పట్లో పెద్ద హిట్. కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ. లవ్ స్టోరీస్ నయా పుంతలు తొక్కించిన మూవీ. యూత్‌ని ఓ రేంజ్‌లో ఊపేసింది. చాలా ప్రభావితం చేయడంతోపాటు లవ్ స్టోరీస్లో ఓ కల్ట్ మూవీగా నిలిచింది. తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య ఈ మూవీని రూపొందించారు. పవన్ కళ్యాణ్‌కి జోడీగా భూమిక నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ సీన్లు, ముఖ్యంగా నడుము సీన్ సినిమాని మలుపుతిప్పింది. నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ ఇప్పటికీ రీ రిలీజ్ చేసినా ఫ్యాన్స్ ఊగిపోయి చూసేలా ఉంటుంది.
తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు ఎస్ జే సూర్య తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తమిళ `ఖుషి` కంటే తెలుగు ఖుషి సూపర్ డూపర్ హిట్ కావడానికి కారణం ఏంటో తెలిపారు. ఆ రహస్యాన్ని బయటపెట్టాడు సూర్య. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. `ఖుషి` మూవీ తమిళంలో విజయ్‌తో చేశాడు. జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో పవన్, భూమికలతో రీమేక్ చేశాడు సూర్య.
దీనిపై సూర్య చెబుతూ, `తమిళంలో `ఖుషి` సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ తెలుగులో `ఖుషి` సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలా పెద్ద హిట్ కావడానికి మెయిన్ రీజన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టార్ డమ్, ఆయన మ్యానరిజం` అని తెలిపారు ఎస్ జే సూర్య. ఇందులో విజయ్ `ఖుషి` పెద్ద హిట్ అయినా, తెలుగులో మాత్రం అంతకంటే పెద్ద హిట్ అయ్యిందనే కోణంలో సూర్య మాట్లాడారు.
దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు. కానీ ఇది విజయ్ ఫ్యాన్స్ కి మండేలా చేస్తుంది. సూపర్ హిట్ కంటే బ్లాక్ బస్టర్ పెద్ద పదం అని వాళ్లు అంటున్నారు. కానీ ఆయన చెబుతున్న ఉద్దేశ్యం పవన్ వల్లే తెలుగులో ఇంతటి విజయాన్ని సాధించిందని వెల్లడించారు. ఆ చిన్న డిఫరెంట్స్ తో పవన్, విజయ్ ఫ్యాన్స్ నెట్టింట వార్‌కి దిగుతున్నారు. మొత్తంగా తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అనేది తెలుగు ఆడియెన్స్ వాదన.
సూర్య చెప్పే మీనింగ్ కూడా అదే. కానీ ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతుంది. ఇటీవల తెలుగు, తమిళ ఆడియెన్స్ మధ్య వార్ నడుస్తుంది. ముఖ్యంగా రీమేక్‌లు చెడగొట్టారంటూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో `ఖుషి`ని ప్రస్తావన తెస్తూ మరోసారి వార్‌కి దిగుతున్నారు అభిమానులు. ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
ఇక ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నారు సూర్య. ఆయన తెలుగులో `గేమ్ ఛేంజర్`తోపాటు నాని `సరిపోదా శనివారం` లో నటిస్తున్నారు. మరోవైపు తమిళంలో `ఇండియన్ 2`, `రాయన్`, `లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్`తోపాటు విక్రమ్ మూవీ చేస్తున్నారు. దర్శకత్వం మానేశాడు. చివరగా ఆయన పవన్‌తో `పులి` మూవీ చేశాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటించాల్సిన `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్`, `హరిహర వీరమల్లు` చిత్రాలను హోల్డ్ లో పెట్టాడు. ఎలక్షన్స్ తర్వాత ఆయన ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఇక విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇటీవలే `తమిళగా వెట్రీ కజగం` పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదే తన చివరి మూవీ అని తెలుస్తుంది.