నేను చాలా లేజీ.. సినిమాల్లో ఎలా ఉండగలుగుతున్నాను.. ప్రభాస్‌ సంచలన వ్యాఖ్యలు.. మూడు వీక్ నెస్‌లు రివీల్‌

First Published Jun 23, 2024, 5:19 PM IST

ప్రభాస్‌ కి చాలా సిగ్గు అని, ఇంట్రోవర్ట్ అని అంటుంటారు. కానీ ఆయన తన వీక్‌నెస్‌లు బయటపెట్టాడు. అంతేకాదు తాను ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

ప్రభాస్ తెలుగులోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ హీరో. ఆయన్ని మించిన స్టార్‌ లేరంటే అతిశయోక్తి కాదు. `బాహుబలి` చిత్రంతో ఆయన ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగాడు. `సలార్‌`తో తన సత్తా చాటాడు. ఇప్పుడు `కల్కి2898ఏడీ`తో తన రేంజ్‌ని చూపించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో `బాహుబలి` రికార్డులు బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఆ స్థాయి విజయం సాధిస్తుందా అనేది డౌట్‌. సినిమాపై పెద్దగా బజ్‌ లేకపోవడంతో సినిమా పెద్ద రేంజ్‌ హిట్‌ కష్టమంటున్నారు. 
 

మరోవైపు సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తే ఆడియెన్స్ అంచనాలను రీచ్‌ రావడం కష్టమని, అందుకే అంతగా హైప్‌ క్రియేట్‌ చేయడం లేదని టీమ్‌ నుంచి వినిపిస్తున్న మాట. ఏదేమైనా మరో నాలుగు రోజుల్లో `కల్కి 2898ఏడీ` భవితవ్యం తేలబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్‌ అవుతుంది. బేసిక్‌గా ప్రభాస్‌ లేజీ అంటుంటారు. ఆయన సిగ్గు ఎక్కువనే టాక్‌ కూడా ఉంది. జనాలతో త్వరగా కలవడని, పబ్లిక్‌కి దూరంగా ఉండాలనుకుంటారని అంటున్నారు. ఆయన కూడా తన వీక్‌నెస్‌లు బయటపెట్టాడు. 
 

ప్రభాస్‌ తనలోని మూడు వీక్‌నెస్‌లు బయటపెట్టాడు. తాను లేజీ పర్సన్‌ అని వెల్లడించారు. ఇంట్లో తాను లేజీగా ఉంటానని చెప్పాడు. దీంతోపాటు షై ఫిలింగ్‌ ఎక్కువ అని, అలాగే పబ్లిక్‌ తో ఎక్కువ కనెక్ట్ కాలేనని, ఏదో తెలియని ఇబ్బంది అనిపిస్తుందని, జనంలో కంఫర్ట్ గా ఉండలేనని తెలిపారు. తనని ఎవరైనా గమనిస్తున్నారంటే తాను ఇబ్బంది పడతానని చెప్పారు ప్రభాస్‌. 
 

కెమెరా ముందుఓకే, షాట్‌ ఓకే చెప్పాక, చేయాల్సింది చేస్తాను, కానీ కెమెరా ముందుగానీ, అలాగే చుట్టు పక్కల అయినా ఎవరైనా తనని చూస్తున్నారని అనిపిస్తే షై ఫీలింగ్‌ వస్తుందని, కొంత నర్వస్‌కి గురవుతానని చెప్పారు. ఇలా షూటింగ్‌లో కొన్ని సార్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. జనంతో త్వరగా కలవలేనని, ఒకేసారి చాలా మందిని చూసినప్పుడు చాలా నర్వస్‌ అయిపోతానని చెప్పాడు. 
 

అంతేకాదు ఈ సందర్భంగా ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి క్వాలిటీస్‌తో తాను ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నాను, ఎందుకు ఉన్నాను, ఉండటం రైటా? రాంగా? అనిపిస్తుందన్నారు ప్రభాస్‌.  `బాహుబలి` తర్వాత నాకు ఆ ఛాన్స్ లేదని, కచ్చితంగా కంటిన్యూ చేయాల్సి వస్తుందని బాంబ్‌ పేల్చారు ప్రభాస్‌. `సాహో` ప్రమోషన్స్ సమయంలో ఇంగ్లీష్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ క్లిప్‌ వైరల్‌ అవుతుంది. `కల్కి` సినిమా రిలీజ్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ దీన్ని వైరల్‌ చేస్తున్నారు. 
 

ఈ నెల 27న `కల్కి 2898ఏడీ` విడుదల కాబోతుంది. దీంతోపాటు ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం `ది రాజాసాబ్‌`, `స్పిరిట్‌`, హనురాఘవపూడి మూవీ, అలాగే `సలార్‌ 2` చేయాల్సి ఉంది. `కల్కి` నుంచి మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నాయట. ఇలా నాలుగైదు సినిమాలతో ప్రభాస్‌ మరో రెండు మూడేళ్లు బిజీగా ఉన్నారు.

Latest Videos

click me!