యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బాగా అచ్చొచ్చిన డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత వివి వినాయక్ పేరే చెప్పాలి. ఆది చిత్రంతో ఎన్టీఆర్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు వివి వినాయక్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆది, సాంబ, అదుర్స్ చిత్రాలు వచ్చాయి. ఆది, అదుర్స్ సూపర్ హిట్స్ కాగా.. సాంబ మాత్రం జస్ట్ ఒకే అనిపించింది.