దిగొచ్చిన యాంకర్‌ శ్యామల.. ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు, భయంగా ఉందంటూ వీడియో.. వైరల్‌

Published : Jun 07, 2024, 09:18 PM IST

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన యాంకర్‌ శ్యామల ఇప్పుడు ఓ వీడియోని విడుదల చేసింది. బెదిరిస్తున్నారని, భయంగా ఉందంటూ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది.   

PREV
16
దిగొచ్చిన యాంకర్‌ శ్యామల.. ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు, భయంగా ఉందంటూ వీడియో.. వైరల్‌

యాంకర్‌ శ్యామల.. చిత్ర పరిశ్రమలో క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. ఆమె యాంకర్‌గా బాగా రాణిస్తున్నారు. ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. పర్సనల్‌ విషయాలో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆమె ఇటీవల కాలంలో యాంకర్‌గా మెప్పిస్తుంది. అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది. ఇలా సినిమాల్లో బిజీగా ఉన్న శ్యామల ఇటీవల రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఏపీ ఎన్నికల సమయంలో ఆమె కామెంట్స్ దుమారం రేపాయి.  

26
pawan shyamala

యాంకర్‌ శ్యామల వైసీపీకి సపోర్ట్ చేసింది. ఆ పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా జనసేన అధినేత, హీరో పవన్‌ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఆమె పిఠాపురంలో ప్రచారం నిర్వహించింది. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం ఆమె ఎంతో శ్రమించింది. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. పవన్‌ చేసిన సేవ చూడలేని, ఆయనలో ఆవేశం ఎక్కువ అని, అరవడం మాత్రమే చూశానని సేవ చేయడం చూడలేదని చెప్పింది. ప్రచారంలో ఇంకా డోస్‌ పెంచి మాట్లాడింది. 

36

కానీ ఎన్నికల ఫలితాలు రివర్స్ వచ్చాయి. అధికార వైసీపీ ఘోర పరాజయం చెందింది. కేవలం 11 సీట్లకే పరిమితమయ్యింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 గెలుపొంది సంచలన విజయం సాధించారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్‌ కళ్యాణ్‌.. వంగా గీతపై విజయం సాధించారు. అదే సమయంలో పవన్ జనసేన పార్టీ 21 సీట్లు పోటీ చేస్తే మొత్తం గెలవడం విశేషం. దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

46

ఈ నేపథ్యంలో యాంకర్‌ శ్యామల తలొగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ వీడియో విడుదల చేసింది. అంతేకాదు తనని కొందరు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, చాలా భయంగా ఉందని వాపోయింది. తాను తప్పుగా మాట్లాడలేదని, ఉన్నదే మాట్లాడానని, ఎవరిని వ్యక్తిగతంగా కామెంట్‌ చేయడం తన ఉద్దేశ్యం కాదని, అలా తాను వ్యాఖ్యానించలేదని, రాజకీయంగా మాత్రమే తాను విమర్శలు చేసినట్టు చెప్పింది. కానీ ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, భయమేస్తుందని చెప్పింది యాంకర్‌ శ్యామల. 
 

56

ఇందులో యాంకర్‌ శ్యామల మాట్లాడుతూ, వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త, వైసీపీ కుటుంబానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. `ఓడిపోయాం కానీ.. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గెలిచినప్పుడు ఏనాడూ విజయ గర్వంతో విర్రవీగలేదు. ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. అలాగే ఈసారి వైఎస్ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని.. మీ అందరి మద్దతుతో గెలుస్తారు. మనం అందరం ఆయన వెంట నడిస్తే మంచి ప్రభుత్వంగా ఏర్పాటవుతాం. ఎప్పటికీ జగన్ అన్నతోనే ఉంటా. ఈ ఐదేళ్లు ఏపీకి మంచి జరగాలని కోరుకుంటున్నా` అని చెప్పింది శ్యామల.  
 

66

ఈ సందర్భంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ, బీజేపీ నాయకులకు శ్యామల అభినందనలు తెలిపింది. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. `కాల్స్ చేసి బెదిరిస్తున్నారు.  ఒక రకంగా భయమేస్తోంది. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. అలా అని మీకు నచ్చంది నాకు నచ్చిందని నేను బతకడానికి వీల్లేదంటే చాలా అన్యాయం. దయచేసి ఏదీ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదు. ఎవరిపై వ్యక్తిగత విమర్శలు ఎప్పుడూ చేయలేదు. మీరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేందుకు ఎంత చేయాలో అంత చేశా, అప్పుడు కూడా ఉన్నదే చెప్పాను. లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా` అని వెల్లడించింది శ్యామల. ఈ వీడియోపై టీడీపీ జనసేన కార్యకర్తలు స్పందించి కౌంటర్లు వేస్తున్నారు. సింపతీ గేమ్‌ ఆడుతుందని కౌంటర్లు వేస్తున్నారు.  ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అభిమానులు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories