దర్శి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో కాండిడేట్ మార్పు వల్ల వైసీపీ కైవసం అయ్యింది. టీడీపీ కంచుకోటలో జనసేనకు అవకాశం ఇవ్వరు. కాబట్టి ఇది నిరాధారమైన పుకారే కావచ్చు. అయితే జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో హైపర్ ఆది పోటీ చేయవచ్చు. జనసేన పార్టీలో పెద్ద తలకాయలు ఎవరంటే... పవన్, నాదెండ్ల, నాగబాబు. తర్వాత ఎవరంటే సామాన్య జనాలకు తెలియదు. కాబట్టి టీడీపీ ఇచ్చే ఆ ముప్పై సీట్లకు పార్టీలో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే సాధారణ కార్యకర్తలు సీట్లు అడగరు, అడిగినా ఇవ్వరు...