రాజమౌళి, చిరు, చరణ్‌, బన్నీ, ప్రభాస్‌పై ట్రోల్స్.. కౌంటర్లతో రెచ్చిపోయిన హైపర్‌ ఆది

Published : Nov 19, 2025, 07:44 AM IST

హైపర్‌ ఆది సోషల్‌ మీడియా ట్రోల్స్ పై స్పందించారు. ఇటీవల రాజమౌళిపై ట్రోల్ చేసిన వారికి, అలాగే చిరు, చరణ్‌, బన్నీ, విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌లపై ట్రోల్‌ చేసిన వారికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు ఆది. 

PREV
15
స్పీచ్‌లతో దడదడలాంచిన హైపర్‌ ఆది

హైపర్‌ ఆది స్టేజ్‌ ఎక్కాడంటే స్పీచ్‌తో దడదడలాడిస్తారు. యాసలు, ప్రాసలు, పంచ్‌ డైలాగ్‌లో ఉర్రూతలూగిస్తారు. నాన్ స్టాప్‌గా ఆడియెన్స్ ని తన స్పీచ్‌తో ఆకట్టుకుంటారు. బండ్లగణేష్‌, ఎస్‌కేఎన్‌లను మించి ఆయన స్పీచ్‌ ఆద్యంతం అలరించేలా సాగుతుందంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఆయన హీరోలు, సినిమాలపై ట్రోలింగ్‌పై రెచ్చిపోయారు. ట్రోలర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చారు. ఊపిరి మెసలకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడుకున్నారు.

25
యాంకర్‌ సుమపై ఆది ప్రశంసలు

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన `ప్రేమంటే` మూవీ(ఈ నెల 21న రిలీజ్‌) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో హైపర్‌ ఆది పాల్గొన్నారు. ఆయన తెలుగు సినిమా స్థాయి గురించి, ఖ్యాతి గురించి గొప్పగా చెప్పారు. తెలుగు సినిమాకి గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అయితే, తెలుగు సినిమా అనగానే గర్వంగా సెల్యూట్‌ కొట్టేలా చేసింది చిరంజీవి అయితే, తెలుగు సినిమా అంటే ఏ దేశం వెళ్లిన నేను తెలుగోడిని అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రాజమౌళి అని ప్రశంసించారు హైపర్‌ ఆది. ఇటీవల వచ్చిన `వారణాసి` ట్రైలర్‌ చూస్తే గూస్‌ బంమ్స్ వచ్చాయని, ఇప్పటికీ అది తన మైండ్‌ లో నుంచి పోవడం లేదన్నారు. ఈ సందర్భంగా `వారణాసి` ఈవెంట్‌ని బాగా మ్యానేజ్‌ చేసిన యాంకర్‌ సుమపై ప్రశంసలు కురిపించిన ఆది, రైటర్స్ ని గౌరవించాలని, వాళ్లు పెన్నుపెట్టనిదే సినిమా లేదన్నారు.

35
ట్రోలింగ్‌పై రెచ్చిపోయిన హైపర్‌ ఆది

ట్రోలింగ్‌పై హైపర్‌ ఆది మాట్లాడుతూ, `ఇప్పటి వరకు సినిమాని చంపేసిన ఐబొమ్మ దరిద్రం పోయింది, కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే అది సోషల్‌ మీడియాలో నెగటివిటీ. లెజెండరీ యాక్టర్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదామని వస్తోన్న యాక్టర్స్ మీద కూడా విపరీతమైన నెగటివిటీ చేస్తున్నారు. నాలాంటి వాళ్లపై ట్రోల్‌ చేస్తే నేను పెద్దగా పట్టించుకోను, కొందరు సెన్సిటివ్‌గా ఉంటారు. ఇలాంటి ట్రోల్స్ వారిపై ప్రభావం చూపుతాయి. వాళ్లు చేసే పనులపై, వాళ్లు చేసే సినిమాలపై ఇంపాక్ట్ చూపుతాయి. దేశం గర్వపడేలా సినిమాలు చేసిన రాజమౌళి ఒక సినిమా పోస్టర్‌ వదిలితే దానిమీద కూడా తలదించుకునేలా చేస్తున్నాం. రాజమౌళి `వారణాసి` ఈవెంట్‌లో చిన్న టెక్నీకల్‌ సమస్య వచ్చి గ్లింప్స్ ప్లే అవలేదని ఎమోషనల్‌ అయ్యారు. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. ఆయన నాకు రామాయణం, మహాభారతం అంటే ఇష్టమని చెప్పారు. ఆ రోజు ఆ సమస్య వల్ల ఆయన హనుమంతుడిపై అలిగారే గానీ, అవమానించలేదు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా` అని తెలిపారు హైపర్‌ ఆది.

45
ఎన్టీఆర్‌, చరణ్‌, ప్రభాస్‌, బన్నీలపై ట్రోల్స్

ఆయన ఇంకా మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ సినిమా కోసం సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్‌. బాలకృష్ణగారు మాట్లాడితే ట్రోలింగ్‌, అల్లు అర్జున్‌ నవ్వితే ట్రోలింగ్‌, సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్‌ వల్ల సరిగా మాట్లాడలేపోతుంటే ట్రోలింగ్‌, `బాహుబలి`తో భారతీయ సినిమాని ప్రపంచానికి తీసుకెళ్లిన ప్రభాస్‌ లుక్స్ పై ట్రోలింగ్‌, రామ్‌ చరణ్‌ `చికిరి` సాంగ్‌లో డాన్సు స్టెప్పులపై ట్రోలింగ్‌, విజయ్‌ దేవరకొండ మీద మన ఇండస్ట్రీ వాళ్లే ట్రోలింగ్‌, ఒక వ్యక్తిని అంతటి మానసికంగా కుంగదీయాల్సిన పనేంటి? శ్రీలీల మన తెలుగు నుంచి బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లో సినిమా చేసి రాణిస్తుంటే, ఆమెకి డాన్సులు తప్ప, యాక్టింగ్‌ రాదంటూ ట్రోలింగ్‌. `భగవంత్‌ కేసరి` నేషనల్‌ అవార్డుకి వెళ్లిందంటే అందులో శ్రీలీల పాత్ర కూడా ఎంతో ఉంది` అని అన్నారు ఆది.

55
సినిమాలు ఫెయిల్‌ అవడానికి కారణం ఇదే

ఇంకా మాట్లాడుతూ, మెగాస్టార్‌ చిరంజీవి మీద డీప్‌ ఫేక్‌ ఏఐ వీడియోలు చేశారు, ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా?. నాకు తెలిసి ఆయన సినిమాలు రికార్డులు కొట్టినప్పుడు ఈ ట్రోల్‌ చేసినవాడు అమ్మ కడుపులో కూడా పడి ఉండదు. అలాంటి వ్యక్తులు వాళ్లు, ఆయన మూడుదశాబ్దాలపాటు నెంబర్‌ 1గా ఉన్నారు, ఆ టైమ్‌లో వాడికి ఒకటి అంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు. తుఫాన్ వచ్చినా, ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్లినప్పుడు వాడికి నడవడం కూడా తెలిసి ఉండదు. అలాంటివాడు మెగాస్టార్‌ చిరంజీవి మీద ట్రోల్స్ చేయడం ఏంటి? ఆయన ఒక స్టేట్‌ కో, ఒక కాస్ట్ కో సంబంధించిన వ్యక్తి కాదు, దేశం గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోలింగా? సినిమాలు ఎందుకు చనిపోతున్నాయి, ఎందుకు ఆడటం లేదంటే? ఇంత మంది ట్రోలింగ్‌ చేయడం వల్ల. రేపు పొద్దున వాళ్లు తెరపై కనిపించినప్పుడు వాళ్లు చేసే యాక్షన్‌ కామెడీగా అయిపోతుంది నార్మల్ ఆడియెన్స్ కి. హీరోయిజం ఫెయిల్‌ అవుతుంది కాబట్టే సినిమాలు ఫెయిల్‌ అవుతున్నాయి. హీరోలు, నిర్మాతలు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల కష్టాన్ని మీరుఒక్క నెగటివిటీతో చంపేస్తున్నారు` అంటూ మండిపడ్డారు హైపర్‌ ఆది. ఆయన స్పీచ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories