BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్

Published : Sep 08, 2026, 07:31 PM IST

BiggBoss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 రియల్టీ షో మొదలైపోయింది. ఇందులో సెలెబ్రిటీలు, కామనర్లు పోటీపడుతున్నారు. అయితే జబర్దస్త్ హైపర్ ఆది షోలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లకు తన సపోర్టు తెలిపాడు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

PREV
13
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు హైపర్ ఆది సపోర్ట్

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌ మొదలైన వెంటనే కంటెస్టెంట్లకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ముగ్గురు కంటెస్టెంట్లకు తన సపోర్ట్ ప్రకటించారు. ఆటో రామ్ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, పొట్టి నరేష్‌లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టులు పెట్టారు. బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 6న ప్రారంభం కాగా, ఈ ముగ్గురూ షోలోకి అడుగుపెట్టారు.

23
రామ్ ప్రసాద్, నరేష్‌తో అనుబంధం

హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ టీవీ ప్రేక్షకులకు చాలాకాలంగా పరిచయమే. జబర్దస్త్‌లో ఇద్దరూ కలిసి చేసిన కామెడీ స్కిట్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. పలు కామెడీ కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ఇక పొట్టి నరేష్ కూడా తన కామెడీతో టీవీ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ ముగ్గురికి ఆది మద్దతు ఇవ్వడంతో వారి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రామ్ ప్రసాద్, నరేష్‌కు ఆది ఇచ్చిన సపోర్ట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

33
వర్షిణికి కూడా ఎందుకు?

వర్షిణి సౌందరరాజన్‌ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రముఖ కంటెస్టెంట్. యాంకర్‌గా, నటిగా ఆమెకు తెలుగు టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. గతంలో పలు టీవీ కార్యక్రమాల్లో హైపర్ ఆదితో కలిసి వర్షిణి కనిపించింది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వర్షిణికి కూడా ఆది మద్దతు ఇవ్వడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది. హైపర్ ఆది సపోర్ట్ చేసిన ఈ ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా ఆడతారు? ప్రేక్షకుల ఓట్లతో ఎంత దూరం వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories