Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌

Published : Sep 08, 2026, 06:49 PM IST

జబర్దస్త్ కామెడీ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించే రామ్‌ ప్రసాద్‌ ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10లో నవ్వులు పంచేందుకు వచ్చారు. అయితే ఈ షోకిగానూ ఆయనకు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట.

PREV
14
ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరిలో బిగ్‌బాస్‌లోకి రామ్‌ ప్రసాద్‌

నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్‌ తెలుగు 10వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 6న జరిగిన ప్రారంభ ఎపిసోడ్‌తో ఈసారి 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వారిలో జబర్దస్త్‌ కమెడియన్‌ ఆటో రామ్‌ ప్రసాద్‌ కూడా ఉన్నారు. చాలా కాలంగా తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్‌ ప్రసాద్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరిలో ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారట.

24
నాగార్జునకే పంచ్‌లు విసిరిన రామ్‌ ప్రసాద్‌

రామ్‌ ప్రసాద్‌ ఎంట్రీ సమయంలోనే హోస్ట్ నాగార్జున ఆయనకు ఝలక్‌ ఇచ్చాడు. స్టేజ్‌పై ఎంటర్‌టైన్‌ చేయాలని చెప్పగా, నవ్వించలేని కారణంగా బయటకు పంపించేస్తామని నాగ్‌ ఝలక్‌ ఇచ్చాడు. `నన్ను కామెడీ చేయమని, మీరు కామెడీ చేస్తున్నారేంటి సర్‌` అంటూ నాగ్‌కే కౌంటర్‌ ఇచ్చాడు రామ్‌ ప్రసాద్‌. దీంతో ప్రారంభంలోనే చర్చనీయాంశంగా మారాడు. మరి జబర్దస్త్ లో మోస్ట్ వాంటెడ్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆటో రామ్‌ ప్రసాద్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చినందుకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు, బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎంత ఇస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

34
ముఖేష్‌ గౌడకి మించిన రెమ్యూనరేషన్‌

అయితే బిగ్‌ బాస్‌ తెలుగు 10 షోలో అత్యధిక పారితోషికం బుల్లితెర స్టార్‌, `గుప్పెడంత మనసు` సీరియస్‌ ఫేమ్‌ రిషి సార్‌ అలియాస్‌ ముఖేష్‌ గౌడకి అనే ప్రచారం జరిగింది. ఆయనకు వారానికి నాలుగు లక్షలు ఇస్తున్నారట. కానీ ఆయన్ని మించిన పారితోషికం రామ్‌ ప్రసాద్‌ అందుకుంటున్నాడట. మొదట రామ్‌ ప్రసాద్‌కి వారానికి రూ.3.5 నుంచి 4 లక్షల వరకు ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ అంతకు మించి అని సమాచారం. రామ్‌ ప్రసాద్‌కి ఏకంగా రూ.4.5 లక్షలు ఇస్తున్నారట. అంటే రోజుకి ఆయనకు రూ.65వేలు అందుతున్నాయని చెప్పొచ్చు.

44
బిగ్‌ బాస్‌ విన్నర్‌ని మించిన పారితోషికం

సాధారణంగా బిగ్‌ బాస్‌ షోకి వచ్చే వారికి రోజుకి రూ.40వేలు ఇస్తే ఎక్కువ. పాపులర్‌ సెలబ్రిటీలు అయితే రోజుకి యాభై వేల వరకు ఇస్తారు. కానీ అంతకు మించి మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఆ అరుదుగా రామ్‌ ప్రసాద్‌కి ఇస్తున్నారు. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటాడు రామ్‌ ప్రసాద్‌. ఆయన వేసే పంచ్‌లకు అటు జడ్జ్ లు, ఇటు కమెడియన్లు కూడా నవ్వక మానరు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోలోనూ అదే ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని తీసుకున్నారట. అయితే రామ్‌ ప్రసాద్‌ గ్రాండ్‌ ఫినాలే వరకు ఉంటే.. విన్నర్‌కి మించిన పారితోషికం అందుకుంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories