యాంకర్ రవి, సిరి, జ్యోతి, ఇతర బుల్లితెర నటులు ఈ షోలో పాల్గొన్నారు. హైపర్ ఆది ఎప్పటిలాగే ఒక్కొక్కరిపై తన కామెడీ పంచ్ లతో విరుచుకుపడ్డాడు. హైపర్ ఆది, సిరి కలసి ఓ స్కిట్ పెర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్లుగా నటించారు. నాన్న నాకు రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉంది బోర్ కొడుతోంది అని సిరి అంటుంది. నీకు రెండు రోజులకే బోర్ కొడితే.. ఇక వందరోజులు వాళ్ళని భరించే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బిగ్ బాస్ గురించి హైపర్ ఆది పరోక్షంగా కామెంట్స్ చేశాడు.