జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు షోలలో పాల్గొంటున్నాడు. సినిమా అవకాశాలు కూడా ఆదికి బాగానే వస్తున్నాయి. జబర్దస్త్ అయినా, శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, రాజకీయ వేదిక అయినా ఎక్కడైనా సరే.. హైపర్ ఆడికి పంచ్ డైలాగులు ప్రవాహంలాగా తన్నుకు వస్తాయి.
హైపర్ ఆదిలో ఉన్న స్పెషాలిటీ అదే.. పర్ఫెక్ట్ డైమింగ్ తో డైలాగులు పేల్చగలడు. కొన్నిసార్లు హైపర్ ఆది చెప్పే ఫన్నీ డైలాగులు డబుల్ మీనింగ్ అనిపించడంతో వివాదం అవుతూ ఉంటాయి. హైపర్ ఆది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అప్పుడప్పుడూ జనసేన పార్టీ వేదికలపై హైపర్ ఆది చెప్పే మాటలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.
హైపర్ ఆది సినిమాలు, షోలతో బాగానే సంపాదిస్తున్నాడు. రీసెంట్ గా హైపర్ ఆది జబర్దస్త్ సుజాత హోస్ట్ గా ఒక చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో హైపర్ ఆది అనేక విషయాలని బయట పెట్టాడు. సుజాత కూడా హైపర్ ఆదికి రాజకీయాలపై ఉన్న ఆసక్తిని, పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
ఊహించని విధంగా హైపర్ ఆదిని సుజాత ఒక ప్రశ్నతో మెలిక పెట్టింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అంటే మీకు ఇష్టం కదా.. ఆయన ఏమీ దాచుకోకుండా దానాలు, సహాయాలు చేస్తుంటారు. మీరేమో వరుస పెట్టి ఆస్తులు కొంటున్నారు అని అడిగేసింది.
దీనితో హైపర్ ఆది బదులిస్తూ తాను ఆస్తులు కొంటున్నది ఫ్యామిలీ కోసమే అని తెలిపాడు. పవన్ కళ్యాణ్ గారు 100 రూపాయలు ఉంటే 100 దానం చేయడానికి వెనుకాడరు. నా దగ్గర 100 ఉంటే 10 దానం చేసి మిగిలింది దాచుకుంటా. అది కూడా ఫ్యామిలీ కోసం అన్నట్లుగా తెలిపాడు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అతిథిగా హాజరైన ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ నందిని అగసర తన కష్టాలు చెప్పుకుని భావోద్వేగానికి గురైంది. వెంటనే హైపర్ ఆది.. ఈ షోకి వచ్చిన పేమెంట్ మొత్తాన్ని ఆమెకి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇప్పటికే జబర్దస్త్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు హైదరాబాద్ లో సొంత ఫ్లాట్ ఇతర ఆస్తులు కూడబెట్టుకున్నారు. సుజాత వరుసపెట్టి ఆస్తులు కొంటున్నారు అని చెప్పిందంటే.. హైపర్ ఆది ఇంకెంతగా సంపాదిస్తున్నాడో మరి.