అనసూయ జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదా... నిజం బయటపెట్టిన హైపర్ ఆది!

Published : Feb 05, 2024, 07:22 AM IST

అనసూయ భరద్వాజ్ ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా చేసింది. ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ షో. 2022లో సడన్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. అందుకు కారణం ఏమిటో హైపర్ ఆది వెల్లడించాడు.   

PREV
17
అనసూయ జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం ఇదా... నిజం బయటపెట్టిన హైపర్ ఆది!
Anasuya bharadwaj

2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. నాగబాబు, రోజా జడ్జెస్ గా, కొందరు కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా షో మొదలైంది. అనతి కాలంలోనే జబర్దస్త్ పాపులారిటీ తెచ్చుకుంది, అనసూయ యాంకర్ గా పరిచయమైంది. 

 

27

గ్లామరస్ యాంకర్ గా ఆడియన్స్ ని కట్టిపడేసింది. తెలుగు యాంకర్స్ స్కిన్ షో చేయడం అనే కాన్సెప్ట్ అనసూయనే పరిచయం చేసింది. పొట్టిబట్టల్లో ఆ షో వేదికగా సంచలనాలు చేసింది. 

37
Anasuya bharadwaj

అనసూయ విపరీతమైన ఫేమ్ రాబట్టింది. దాంతో ఆమెకు వెండితెర మీద కూడా ఆఫర్స్ మొదలయ్యాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ చిత్రాలలో కీలక రోల్స్ ఆమెకు దక్కుతున్నాయి. 
 

47


2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలెనే జబర్దస్త్ మానేస్తున్నట్లు అనసూయ అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే అసలు కారణం వేరే ఉంది అనేది మాత్రం నిజం. 

57
Anasuya bharadwaj


అనసూయ జబర్దస్త్ మానేశాక కొన్ని ఆరోపణలు చేశారు. తన మీద జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, తాను కోప్పడినా దాన్ని ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ అన్నారు. మరో సందర్భంలో టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది. 
 

67
Anasuya bharadwaj

కాగా తాజాగా జోర్దార్ సుజాత హైపర్ ఆదిని ఇంటర్వ్యూ చేసింది. ఆయన్ని పలు విషయాలు అడగం జరిగింది. మీ కారణంగానే అనసూయ జబర్దస్త్ మానేశారనే వాదన ఉంది. దీనికి మీ సమాధానం ఏమిటి? అనగా... హైపర్ ఆది సీరియస్ గా ముఖం పెట్టి ఏదో చెప్పాడు. 

 

77

ప్రోమోలో ఆది ఏం చెప్పాడు అనేది రివీల్ చేయలేదు. ఆ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ బయటకు వస్తే కానీ అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటో? హైపర్ ఆది ఏమి అన్నాడో? తెలుస్తుంది. కాగా అనసూయ మీద కూడా హైపర్ ఆది పంచులు వేస్తూ ఉండేవాడు... 

Read more Photos on
click me!

Recommended Stories