Teja Sajja : ‘హనుమాన్’ కోసం తేజా సజ్జ త్యాగం... ఏం చేశాడో తెలుసా?

First Published | Feb 4, 2024, 10:25 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా Teja Sajja లేటెస్ట్ ఫిల్మ్ ‘హను-మాన్’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై విన్నర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కోసం తేజా పెద్ద త్యాగమే చేయడం ఆసక్తికరంగా మారింది. 

యంగ్ హీరో తేజా సజ్జా - ప్రశాంత్ వర్మ Prashanth Varma కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను-మాన్’ HanuMan. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. 2024 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు. 
 

చిన్న సినిమాగా ఏకంగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’తో పోటీగా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. పెద్ద చిత్రాలను ఢీకొని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అటు ప్రశాంత్ వర్మ, ఇటు తేజా సజ్జా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. 


ఈ సందర్భంగా ఆయా ఛానెళ్లకు తేజా సజ్జా ఇంటర్వ్యూలో ఇస్తూనే ఉన్నారు.  సినిమా గురించి పలు విషయాలు చెబుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేశారు తేజా సజ్జా.. తన ‘హను-మాన్’  కోసం చేసిన త్యాగాన్ని చెప్పారు. 

‘హను-మాన్’ చిత్రం చేస్తున్న క్రమంలో తేజాకు 70 నుంచి 75 సినిమాల ఆఫర్లు వచ్చాయంట. అందులో 15 సినిమాలు మాత్రం మంచి డీసెంట్ కథలని చెప్పారు. ఇక ‘హను-మాన్’ కోసం వాటన్నింటినీ వదులుకున్నట్టు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 

తేజా సజ్జా చేసిన గొప్ప త్యాగానికి ‘హనుమాన్’ రూపంలో మంచి ఫలితం దక్కిందని అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. తన కెరీర్ నే మలుపు తిప్పడంతో పాటు ప్రేక్షకులు మెచ్చిన సినిమా తీశారంటూ తేజా  సజ్జాను అభినందిస్తున్నారు. 

ఈ చిత్రంతో తేజా సజ్జా, ప్రశాంత్ వర్మను దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ప్రశంసించారు. శాలువాలతో సన్మానించిన విషయం తెలిసిందే. ఇక త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

Latest Videos

click me!