యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మరో కొత్త సినిమాతో వెండితెరపై మెరియబోతోంది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ మాస్ రాజా రవితేజ Ravi Tejaతో కలిసి నటించింది. త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతోంది.
రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ కలిసి నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఈగల్’ Eagle Movie. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మల్టీపుల్ చిత్రాల కారణంగా వాయిదా పడింది. మరో ఐదు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవ్వాళ మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. వైట్ ఎంబ్రాయిడింగ్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ఈయర్ రింగ్స్, నెక్లెస్ ధరించి వెలిగిపోయింది.
ప్రకాశవంతమైన అందంతో ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. చీరకట్టులో క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అనుపమా చీరకట్టు అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మలయాళీ భామను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక ‘ఈగల్’ తర్వాత అనుపమా ‘టిల్లు స్క్వేర్’ Tillu Squareతో అలరించనుంది.