భూమికతో శేఖర్‌ మాస్టర్ సీక్రెట్‌ యవ్వారం.. అందరి ముందు బండారం బయటపెట్టిన హైపర్‌ ఆది.. హీరోయిన్లంతా టచ్‌లోనే

Published : May 29, 2024, 10:37 PM ISTUpdated : May 30, 2024, 07:22 AM IST

శేఖర్‌ మాస్టర్‌ బిజీ కొరియోగ్రాఫర్‌. కానీ ఆయన హీరోయిన్లతో టచ్‌లోనే ఉన్నాడు. హీరోయిన్లతో ఆయన కాల్స్, చాటింగ్‌లను బయటపెట్టాడు హైపర్‌ ఆది.   

PREV
16
భూమికతో శేఖర్‌ మాస్టర్ సీక్రెట్‌ యవ్వారం.. అందరి ముందు బండారం బయటపెట్టిన హైపర్‌ ఆది.. హీరోయిన్లంతా టచ్‌లోనే

టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌లోనూ టాప్‌ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు శేఖర్‌ మాస్టర్‌. స్టార్‌ హీరోల సినిమాలకు ఆయనే మొదటి ఆప్షన్‌గా నిలుస్తున్నారు. ఓ వైపు కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న ఆయన మరోవైపు డాన్స్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన `ఢీ` షోకి జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. 
 

26

హీరోయిన్‌ ప్రణతితో కలిసి శేఖర్‌ మాస్టర్‌ జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా శేఖర్‌ మాస్టర్‌ బండారం బయటపెట్టాడు హైపర్‌ ఆది. ఆయన ఫోన్‌ కొట్టేసి ఆ సక్రెట్స్ అన్ని బయటపెట్టాడు. ఇందులో హీరోయిన్లతో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించాడు. అంతేకాదు భూహిక ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నట్టు తెలిపాడు. 
 

36

హీరోయిన్‌ భూమిక నుంచి కంటిన్యూగా 69 మిస్డ్ కాల్స్ ఉన్నాయట. వరుసగా వస్తూనే ఉందట. ఏంటీ సామీ ఇది అని ప్రశ్నించాడు ఆది. దీనికి శేఖర్‌ మాస్టర్‌ నుంచి సమాధానం లేదు. మరోవైపు శేఖర్‌ మాస్టర్‌ ఫోన్‌ చేసిన డాటా తీస్తే, నందిత, ప్రియమణి, పూర్ణ, శ్రద్ధా దాస్‌, ప్రణీత లకు ఫోన్లు చేశాడట శేఖర్‌ మాస్టర్‌. అయితే ప్రణీత జడ్జ్ అని భావించగా, ఆమె కాదని, డైరెక్షన్‌ డిపార్ట్ మెంట్‌ అని చెప్పడం విశేషం. 
 

46

ఇక శేఖర్‌ మాస్టర్ రోజూ ఏం చేస్తాడో కూడా ఫోన్‌లో ఉందట. 15 మినిట్స్ వాకింగ్‌, అర్థగంట ట్రెకింగ్‌ అని, మరో అరగంట ఇంకేదో ఇంగ్‌ ఉందని అంటూ ట్విస్ట్ ఇచ్చాడు ఆది. చివరికి అది డాన్సింగ్‌ అని చెప్పి కవర్‌ చేశాడు. ఇలా శేఖర్‌ మాస్టర్‌ ఫోన్ లోని సీక్రెట్స్ అని బయటపెట్టాడు హైపర్‌ ఆది. 
 

56

ఇదే కాదు మిగిలిన డాన్సర్ల ఫోన్లు కూడా చెక్‌ చేసి వాళ్లకి ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారో కూడా చెప్పేశాడు. అందరి గుట్టు రట్టు చేశాడు. ఈ క్రమంలో హైపర్‌ ఆది ఫోన్‌ శేఖర్‌ మాస్టర్‌కి దొరకడం విశేషం. అందులో ఆది వ్యవహారాలను కూడా వెల్లడించాడు శేఖర్‌ మాస్టర్‌. రసిక రాణితో, జింగిడి జ్యోతితో చాట్‌ చేశాడట. అందులో ఏముందో చెప్పి రచ్చ లేపాడు శేఖర్‌ మాస్టర్‌. దెబ్బకి ఆయన వద్దకు వచ్చి ఫోన్‌ లాగేసుకున్నాడు ఆది. కామెడీ కోసం చేసిన ఈ స్కిట్ నవ్వులు పూయించింది. 
 

66

చివర్లో జడ్జ్ ప్రణీతని ఆడుకున్నాడు యాంకర్‌ నందు. ఆమెచేత ఓ వ్యాఖ్యం చెప్పించాడు. కప్ప పక్కన కుంప, కుంప పక్కన కప్ప` అని కంటిన్యూగా చెప్పాలి. దీంతో ప్రారంభంలో తగబడింది ప్రణీత. రెండో సారి చెప్పి, దాన్నే రిపీట్‌గా వేసుకోండి అని చెప్పడంలో విశేషం. దీంతో షో మొత్తం నవ్వులతో దద్దరిళ్లింది. ఇది `ఢీ` షోలోని స్కిట్‌. ఆద్యంతం నవ్వులు పూయించింది. సరదా  కోసం ఇదంతా చేసిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories