
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో `అదుర్స్` ఒకటి. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. కామెడీ, యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇందులో నయనతార అందాలు, ఆమె పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంతేకాదు బ్రహ్మానందం, ఎన్టీఆర్‌ల మధ్య కామెడీ, అలాగే నయనతారని బ్రహ్మీ ప్రేమించే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా హిట్ అయ్యిందంటే అది కేవలం కామెడీ వల్లనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇందులోని నయనతార, బ్రహ్మానందం మధ్యలో వచ్చే సీన్లు ఇప్పటికీ మీమర్స్ బీభత్సంగా వాడేస్తుంటారు. ట్రోల్స్ లోనూ ట్రెండ్ అవుతుంటాయి. అంతగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార దీనిపై స్పందించింది. బ్రహ్మానందం సర్‌తో వర్క్ చేయడం చాలా బాగుంటుంది, ఎప్పుడూ నవ్వుతూనే ఉండొచ్చు. బ్రహ్మీసర్ చాలా క్యూట్ గా ఉంటారని ప్రశంసలు కురిపించింది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడింది నయనతార. తారక్ నటన, డాన్సుల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. ఆయన స్పాంటినిటీ పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్బంగా తారక్ డాన్సుల గురించి స్పెషల్ గా చెప్పింది. ఆయన ఎలాంటి రిహార్సల్స్ లేకుండా డాన్సు చేస్తాడని, జస్ట్ ఇలా వచ్చి అలా చేసేసి వెళ్తాడని చెప్పింది నయనతార. సినిమా సీన్లు అయినా, డాన్సులు అయితే అంతే ఫాస్ట్ గా చేస్తాడని, అది చాలా మ్యాజికల్‌గా అనిపిస్తుందని తెలిపింది నయనతార.
మరో ఆసక్తికర, షాకింగ్ విషయం తెలిపింది. ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ఓ డాన్స్ షూట్ జరుగుతుందట. నెక్ట్స్ షాట్ కోసం మేకప్ వేసుకుంటుందట. జస్ట్ పైపైన టచప్‌లు వేసుకుంటుందట నయనతార. దీంతో సెట్‌లో నుంచి ఎన్టీఆర్ ఆమెనే చూస్తున్నాడట. అలా చాలా సేపు చూస్తూనే ఉన్నాడట. దీంతో ఇబ్బంది ఫీలైన నయన్.. ఏంటీ తన చుట్టూ ఏదైనా రాంగ్ జరుగుతుందా అని అడిగిందట. దీనికి తారక్ చెప్పిన సమాధానం షాకిచ్చిందట.
డాన్సుల్లో అంతా నన్నే చూస్తాను, నిన్ను ఎవరు చూస్తారు, ఎందుకు అంత టచప్ లు ఇస్తున్నావ్(మేకప్ వేసుకుంటున్నావ్) అని అన్నాడట తారక్. దెబ్బకి నయన్‌కి దిమ్మతిరిగిపోయిందట. ఆయన డాన్స్ మూమెంట్స్ నే ఆడియెన్స్ చూస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు, తనని ఎవరూ చూడరని ఆయన చెప్పారని, అది నాకు చాలా వండర్‌గా అనిపించిందని తెలిపింది లేడీ సూపర్ స్టార్. ఆ మధ్య `కనెక్ట్` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార ఈ విషయాలు వెల్లడించింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
నయనతార ప్రస్తుతం తెలుగులో ఒకటి రెండు మూవీస్‌కి టాక్స్ జరుగుతున్నట్టు సమాచారం. `కన్నప్ప`, `కల్కి2898ఏడీ`లో గెస్ట్ గా మెరుస్తుందని టాక్. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది నయనతార. మరోవైపు ఎన్టీఆర్ `దేవర` సినిమాలో నటిస్తున్నాడు. ఇది దసరాకి విడుదల కాబోతుంది. బాలీవుడ్‌లో `వార్ 2`లో నటిస్తున్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ మూవీ ఉండబోతుంది.