టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది నటీమణులకు శాపంగా మారింది. కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మంది నటీమణులు వేధింపులకు గురికావడం, మోసపోవడం చూశాం. ఎప్పటికప్పుడు కొందరు నటీమణులు ధైర్యంగా తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలని బయట పెడుతున్నారు.
26
చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా తరచుగా వార్తల్లో ఉండడం చూస్తున్నాం. గతంలో కూడా ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడింది. తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిదా చిత్రంలో గాయత్రీ గుప్తా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది.
36
బుర్రకథ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం 2 లాంటి చిత్రాల్లో గాయత్రీ గుప్తా నటించింది. తాజాగా ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. గతంలో నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే ఎవరూ సపోర్ట్ చేయలేదు.
46
చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారానికి ఒప్పుకుంటున్నారు. తద్వారా అవకాశాలు కూడా పొందుతున్నారు. మరికొందరు నటీమణులు ఆఫర్స్ ఇస్తామని చెప్పడంతో ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నారు. వీరిలో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకున్నా ఆఫర్ వస్తుందనే గ్యారెంటీ లేదు.
56
Gayathri Gupta
వాళ్ళని వాడుకుని వదిలేస్తున్నారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉంది అని గాయత్రీ గుప్తా పేర్కొంది. కొందరు ప్రముఖులపై కూడా ఆమె ఆరోపణలు చేసింది.
66
ప్రస్తుతం గాయత్రీ గుప్తా ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఇది నయం కావాలంటే ట్రీట్ మెంట్ కి చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదని గాయత్రీ గుప్త ఆవేదన వ్యక్తం చేసింది.